జేఎన్‌టీయూ కళాశాలలో సమస్యల పరిష్కారానికి కృషి
ABN , Publish Date - Jan 13 , 2026 | 12:55 AM
జేఎన్‌టీయూ కళా శాలలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రభుత్వవిప్ ఆది శ్రీని వాస్ అన్నారు.
వేములవాడ టౌన్, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): జేఎన్‌టీయూ కళా శాలలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రభుత్వవిప్ ఆది శ్రీని వాస్ అన్నారు. సోమవారం వేములవాడ అర్బన్ మండలంలోని అగ్ర హారంలోగల జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాలను వీసీ కిషన్‌కుమార్ రెడ్డి, రిజిస్టార్ కె.వెంకటేశ్వర్‌రావులతో కలిసి ఆయన సందర్శించి విద్యా ర్థుల తరగతి గదులు, క్యాంటిన్, వంట గదులు, ల్యాబ్‌లను పరిశీలిం చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ త్వరలో కళాశాల కు శాశ్వత భవనం మంజూరు చేస్తామన్నారు. గతంలో విద్యార్థులు ఇబ్బందిపడితే వెంటనే సమస్యను పరిష్కరించామన్నారు. గతం లో డిగ్రీకళాశాలను సందర్శించినపుడు బాలికలకు హాస్టల్ కావా లంటే వెంటనే రూ.10కోట్లు మంజూరు చేశామన్నారు. ప్రస్తుతం హాస్టల్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. గత ప్రభుత్వం కళాశాల ఏర్పాటు కేవలం పేపరుకే మాత్రమే పరిమి తమైందని, ఎలాంటి వసతులు కల్పించలేదన్నారు. అన్ని వసతు లతో కూడిన పక్కా భవనం నిర్మాణం చేస్తామన్నారు. గెస్ట్ ఫ్యాక ల్టీ, ఫ్యాకల్టీల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. విద్యా ర్థులకు నాణ్యమైన మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. ఫైనల్ ఇయర్ విద్యార్థులకు అకాడమీ ద్వారా ఉచిత కోచింగ్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కళాశాల నుండి విద్యా ర్థులు బయటకు ఉద్యోగంతో వెళ్లేలా ఏర్పాట్లు చేసున్నామన్నారు. జేఎన్‌టియు విద్యార్థులు కోరిన వాటిన సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. సీఎం విద్యావిధానంలో పెను మార్పులు తీసుకువ స్తున్నారన్నారు. వేములవాడ నియోజకవర్గంలో రూ.200కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేశామన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో దాదాపు 8శాతం విద్యావిధానానికి కేటాయించామన్నారు. విద్యా ర్థులు చక్కగా చదువుకొని తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను కళాశాల అద్యాపకులు, విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వేణుగోపాల్, విద్యార్థులు, అద్యాపకులు పాల్గొన్నారు.