Share News

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

ABN , Publish Date - Oct 10 , 2026 | 12:39 AM

సిరిసిల్ల విద్యుత్‌ ఉద్యోగుల సమ స్యలను పరిష్కరించడంతోపాటు పదోన్నతులు కల్పిస్తామని ఎన్‌పీడీసీఎల్‌ డైరెక్ట ర్‌ ప్రభాకర్‌ హామీఇచ్చారు.

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

సిరిసిల్ల అర్బన్‌, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్ల విద్యుత్‌ ఉద్యోగుల సమ స్యలను పరిష్కరించడంతోపాటు పదోన్నతులు కల్పిస్తామని ఎన్‌పీడీసీఎల్‌ డైరెక్ట ర్‌ ప్రభాకర్‌ హామీఇచ్చారు. ఇటీవల హన్మకొండలోని తెలంగాణ విద్యుత్‌ నియం త్రణ మండలి కార్యాలయంలో యూనియన్‌ నాయకులు సీఎండి వరుణ్‌రెడ్డిని కలిసి వినతిపత్రాన్ని అందించారు. ఈ నేపథ్యంలో సిరిసిల్ల విద్యుత్‌ శాఖలో నెలకొన్న సమస్యలను తెలుసుకని ఉద్యోగులకు పదోన్నతులను కల్పించేందుకు చర్యలు చేపట్టాలంలూ సీఎం హేమంత్‌తోపాట డైరెక్టర్‌ ప్రభాకర్‌లను నియమిం చారు. దీంతో జిల్లా కేంద్రంలోని విద్యుత్‌ కార్యాయలంలో శుక్రవారం తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకులతో ఎన్‌పీడీసీఎల్‌ జనరల్‌ మేనే జర్‌ హేమంత్‌, ఎన్‌పీడీసీఎల్‌ డైరెక్టర్‌ ప్రభాకర్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకుల వినతి మేరకు ఈనెల 14, 15 నుంచి పదో న్నతులు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తామని, ఉద్యోగుల సమస్యలను తెలుసుకు ని దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సమావేశం లో విద్యుత్‌శాఖ ఎస్‌ఈ శ్రీనివాసరావు, సెస్‌ ఎండి తిరుపతి, డీఈలు అంజయ్య, వెంకటరమణ, యూనియన్‌ అధ్యక్షుడు మహేందర్‌, ప్రధాన కార్యదర్శి కంచర్ల అమరేందర్‌గౌడ్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెట్టి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 10 , 2026 | 12:39 AM