Share News

విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి కృషి

ABN , Publish Date - Oct 24 , 2026 | 12:15 AM

విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎన్‌పీడీసీఎల్‌ నిజామాబాద్‌ సీజీఆర్‌ఎఫ్‌-2 చైర్‌పర్సన్‌ కిషన్‌ అన్నారు.

విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి కృషి

తంగళ్లపల్లి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎన్‌పీడీసీఎల్‌ నిజామాబాద్‌ సీజీఆర్‌ఎఫ్‌-2 చైర్‌పర్సన్‌ కిషన్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఫ్రెండ్స్‌క్లబ్‌లో సబ్‌డివిజన్‌ పరిధిలోని తంగళ్లపల్లి, ఇల్లంతకుంట మండలాల విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ విద్యుత్‌ వినియోగ దారుల సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేశారు. వినియోదదారుల వేదిక ఎన్‌పీడీసీఎల్‌ నిజామాబాద్‌ సీజీఆర్‌ఎఫ్‌-2 చైర్‌పర్సన్‌ కిషన్‌ అధ్యక్షతన జరిగింది. ఈ వేదికలో టెక్నికల్‌ మెంబర్‌ చవాన్‌, ఫైనాన్స్‌ మెంబర్‌ శ్రీనివాస్‌, ఫోర్త్‌మెంబర్‌ శ్రీనివాస్‌రెడ్డిలు పాల్గొని విద్యుత్తు వినియోగ దారుల సమస్యల వినతిపత్రాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సర్పంచ్‌లు, నాయకులు, విద్యుత్తు వినియోగదారులు పాల్గొని విద్యుత్తు సమస్యలను వేదిక దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా బస్వాపూర్‌ సర్పంచ్‌ పుర్మాణి రాజశేఖర్‌రెడ్డి తదితరులు మాట్లాడుతూ త్రీఫేస్‌ విద్యుత్‌ 12 గంటలు సరఫరా చేస్తున్నమని చెప్పడం అబద్ధమని, 5గంటలు మాత్రమే సరఫరా అవుతుందన్నారు. పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొని రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన చంద్రయ్య ఇంటి మీది నుండి విద్యుత్‌ లైన్ల్‌ ప్రమాదకరంగా ఉన్నాయని అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందన్నారు. అలాగే మండేపల్లికి చెందిన మహ్మద్‌ ఫజల్‌ ఇంటి గొడను అనుకొని ఎల్టీలైన్‌ ఉందని పలుమార్లు తొలగించాలని విన్నవించుకున్న పట్టించుకోలేదన్నారు. భారతీయ కిసాన్‌ సంఘ్‌ జిల్లా కార్యదర్శి బియ్యంకార్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలన్నారు. బోయినపల్లికి చెందిన సంపత్‌రావ్‌ మాట్లాడుతూ విద్యుత్‌ సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతుందని, త్వరగా పరిష్కరిం చాలని వినతిపత్రాలను సమర్పించారు. అనంతరం చైర్‌పర్సన్‌ కిషన్‌ మాట్లాడుతూ విద్యుత్‌ సమస్యల పరిష్కారం కోసమే వేదికను ఏర్పాటు చేశామని, సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్ర మంలో ఎన్పీడీసీఎల్‌ అధికారులు, సర్పంచ్‌లు, విద్యుత్‌ విని యోదారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 24 , 2026 | 12:15 AM