లోక్‌అదాలత్‌లో కేసుల పరిష్కారానికి కృషి
ABN , Publish Date - Sep 04 , 2026 | 12:28 AM
పెండింగ్ కేసు లను ఇరువర్గాలు రాజీమార్గంతో నే పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ కోరారు.
సిరిసిల్ల అర్బన్, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : పెండింగ్ కేసు లను ఇరువర్గాలు రాజీమార్గంతో నే పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ కోరారు. సిరిసిల్ల జిల్లా కోర్టులో గురువారం సిరిసిల్ల, వేములవాడ బార్ అసోషియేషన్‌ల ఆధ్వర్యం లో లోక్‌అదాలత్‌పై న్యాయవాదు లతో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీరజ మాట్లా డుతూ పరస్పర అంగీకారంతో కేసులు పరిష్కారమవ డంతో ప్రజలు దీర్ఘకాలిక న్యాయ ప్రక్రియల నుంచి విముక్తి పొందుతారని అన్నారు. రాజీమార్గంతో కేసులు పరిష్కారమైతే సమయం, డబ్బు ఆదా అవుతాయరని పేర్కొన్నారు. ఎన్‌ఐ యాక్ట్ (చెక్‌బౌన్స్) కేసులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. బార్ అసోసియేషన్ సభ్యులు, లోక్ అదాలత్‌లో మరిన్ని కేసులను పరిష్కా రానికి పంపేందుకు సహకరిస్తామని న్యాయవాదులు హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధిక జైస్వాల్, సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మణాచారి, సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అవునూరి రమాకాంత్ రావు, ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, న్యాయవాదులు పాల్గొన్నారు.