Share News

విద్యార్థుల నమోదు పెంచేందుకు కృషి

ABN , Publish Date - Jun 06 , 2026 | 12:14 AM

జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల నమోదు శాతం పెం చేందుకు కృషి చేయాలని, ప్రభుత్వ విద్యాలయాల్లో చది వే విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులు, సదుపాయాలపై క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచా రం, అవగాహన కల్పించాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు.

విద్యార్థుల నమోదు పెంచేందుకు కృషి

సిరిసిల్ల, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల నమోదు శాతం పెం చేందుకు కృషి చేయాలని, ప్రభుత్వ విద్యాలయాల్లో చది వే విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులు, సదుపాయాలపై క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచా రం, అవగాహన కల్పించాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌ ఆడిటోరియం లో విద్యాశాఖ అధికారులు, సాంఘీక సంక్షేమ, మహాత్మ జ్యోతిబాఫూలే, మైనారిటీ, గిరిజన సంక్షేమ విద్యాలయా ల కో-ఆర్డినేటర్లు, ఆదర్శ పాఠశాలల ప్రిన్సిపాల్‌, కస్తూ ర్బాగాంధీ పాఠశాలల ప్రత్యేక అధికారులతో కలెక్టర్‌ గరి మ అగ్రవాల్‌ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల నమోదుశాతం పెం చడం, విద్యాసంస్థల్లో కల్పించాల్సిన సౌకర్యాలు, పండగ వాతావరణంలో విద్యాసంస్థలను పునః ప్రారంభించడం, పాఠ్య పుస్తకాల పంపిణీ, భవిత కేంద్రాల సేవలు, ఎఫ్‌ ఎల్‌ఎన్‌ లక్ష్యాల సాధన, పూర్వ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటు, కామన్‌డైట్‌ మెనూ అమలు, విద్యార్థుల నమో దు లేక మూతబడిన పాఠశాలల పునఃప్రారంభం, ఎస్సీ, బీసీ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రీ-మెట్రిక్‌, పోస్ట్‌ మెట్రిక్‌ వసతి గృహాల్లో సౌకర్యాలు, తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.

విద్యార్థుల నమోదు శాతం పెంచాలి

బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం విద్యా ర్థుల సౌకర్యార్థం చేపడుతున్న ప్రత్యేక మౌలిక వసతు లు కల్పనపై విద్యార్థులు, తల్లిదండ్రులకు విస్తృత అవ గాహన, ప్రచారం క్షేతస్థాయిలో కల్పించి జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల నమోదు శాతం గణ నీయంగా పెంచేందుకు కృషి చేయాలని, గ్రామసభల్లో మండల విద్యాధికారులు పాల్గొని అవగాహన కల్పించా లని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు లక్ష్యం గా బడిబాట కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిం చాలని ఆదేశించారు. 2026-27విద్యా సంవత్సరానికి నిర్దే శించిన లక్ష్యం మేరకు విద్యార్థులు నమోదు అయ్యేలా చూడాలని, ఈవిధంగా మండల విద్యాధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని సూచించారు. విద్యార్థుల నమోదు లేకుండా గతంలో మూతపడిన పాఠశాలలను, ఆయా గ్రామాలను సందర్శించి, సాధ్యాసాధ్యాలను పరిశీలించి, పాఠశాలలను పునఃప్రారంభించే దిశగా చర్యలు చేపట్టా లన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలతో పాటు, సాం ఘీక సంక్షేమ, మహాత్మ జ్యోతిబాఫూలే, మైనారిటీ, గిరిజ న సంక్షేమ, ఆదర్శ, కస్తూర్బాగాంధీ పాఠశాలలను పం డుగ వాతావరణంలో ఈనెల 12వ తేదీన పునఃప్రారం భించాలని, ప్రారంభానికి ముందే అన్ని మరమ్మతులు, విద్యాలయాల పరిసరాలు, కిచెన్‌, డైనింగ్‌ హాల్‌, డార్మెట్రీ లు, స్టోర్‌రూమ్‌లు, తరగతి గదులు, టాయిలెట్లు శుభ్రం చేయాలని ఆదేశించారు. పాఠ్యపుస్తకాలను పంపిణీ చే యడానికి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో నిర్వహిస్తున్న భవిత కేంద్రాల సేవలపై ఆరా తీశారు. జిల్లా వ్యాప్తంగా ఎంత మందికి భవిత కేంద్రాల ద్వారా సేవలు అందుతున్నాయనే వివరాలను అడిగి తెలుసు కున్నారు. భవిత కేంద్రాల సేవలు అవసరం ఉన్న వారిని ముందుగా మ్యాపింగ్‌ చేయాలని సూచించారు. ఫిజియోథెరపీ సేవలు క్రమం తప్పకుండా అందిస్తున్నా మని అధికారులు కలెక్టర్‌ దృష్టికి తీసుకు వచ్చారు. ఎఫ్‌ఎల్‌ఎన్‌లో భాగంగా విద్యా ర్థులకు ప్రాథమిక అక్షరాస్యత లక్ష్యాల సా ధనపై దృష్టి సారించాలన్నారు. ప్రతీ మం డలంలో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్న రెండు ప్రాథమిక పాఠశాలలను గు ర్తించి, క్రమం తప్పకుండా సందర్శిస్తూ, ఎఫ్‌ఎల్‌ఎన్‌ ప్రమాణాలు పెంచేలా మం డల విద్యాధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలన్నారు. పాఠశాలల్లో ర్యాంపులు, డిసెబుల్‌ఫ్రెండ్లీ టాయిలెట్‌ ఏర్పాటు చేయాలన్నారు.

48 పూర్వ పాథమిక పాఠశాల మంజూరు

జిల్లాలో ఈ ఏడాది 48 పూర్వప్రాథమిక పాఠశాలలు మంజూరయ్యాయని కలెక్టర్‌ తెలిపారు. వీటిని అన్ని సదుపాయాలతో సమర్థవంతంగా నిర్వహించాలని, 4 ఏళ్లు పైబడిన పిల్లలు ఇందులో చేరేలా చూడాలన్నారు. రెసిడెన్షియల్‌ విద్యాలయాల్లో కామన్‌ డైట్‌ మెనూ పక్కా గా అమలుచేయాలని, విద్యార్థుల కమిటీలు కొనసాగిం చాలని ఆదేశించారు. జిల్లాలోని బీసీ, ఎస్సీ శాఖల ఆధ్వ ర్యంలో నిర్వహిస్తున్న ప్రీ మెట్రిక్‌, పోస్ట్‌ మెట్రిక్‌ వసతి గృహాల నిర్వహణపై ఆరా తీశారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో వసతి గృహాల అధికారులు మాట్లాడి వసతి గృహాల్లో విద్యార్థుల నమోదు శాతం పెంచాలని కలెక్టర్‌ ఆదేశించారు.

జనగణనలో జిల్లా ముందంజ

జనగణన-2027 భాగంగా తొలి దశ ప్రక్రియను నిర్దేశి త గడువులోగా విజయవంతంగా పూర్తి చేయడంలో రాష్ట్రంలో జిల్లా ముందంజలో నిలిచిందని, విజయవం తం చేసిన ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. సమావేశంలో జిల్లా విద్యాధికారి జగన్‌మోహన్‌రెడ్డి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్‌రెడ్డి, మైనారిటీ అధికారి ఆయేషా తలత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 06 , 2026 | 12:14 AM