మౌలిక వసతుల కల్పనకు కృషి
ABN , Publish Date - Oct 06 , 2026 | 12:41 AM
వేములవాడ మున్సిపల్ పరి ధి నాంపల్లిలోని జర్నలిస్టుల కాలనీలో అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.
వేములవాడ, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): వేములవాడ మున్సిపల్ పరి ధి నాంపల్లిలోని జర్నలిస్టుల కాలనీలో అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. జర్నలిస్టు కాలనీని సోమవారం సందర్శించి నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాటును ప్రారంభించారు. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్లపట్టాలు ఇచ్చేందుకు స్థలపరిశీలన చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావే శంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్టు కాలనీలో ఇంటి నిర్మాణాలు చేసుకుంటున్నట్లు తమ దృష్టికి రావడంతో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజుకు, అధికారులకు సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆదేశించానని తెలిపారు. జర్నలిస్టులు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో కీలకపాత్ర పోషిస్తున్నా రన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్‌చైర్మన్ నరాల శేఖర్, కౌన్సిలర్ కాశ శ్రీనివాస్ తహసీల్దార్ జయంత్ కుమార్, పట్ట ణ సీఐ వీరప్రసాద్, ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ శ్రీనివాస్, జర్నలిస్టు హౌసింగ్ సోసైటీ అధ్యక్షుడు దాసరి దేవేందర్, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు రాపెల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి నక్క తిరుపతి బాబు యాదవ్ తదితరులు ఉన్నారు.