Share News

నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలి

ABN , Publish Date - Apr 29 , 2026 | 12:12 AM

ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని దొంగత నం కేసులను ఛేదించడంతోపాటు కేసుల్లో సమగ్ర విచారణ చేపట్టి నిందితులకు శిక్షలు పడేలా పోలీస్‌ అధికారులు కృషి చేయాలని ఎస్పీ మహేష్‌ బీగీతే కోరారు.

నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలి

సిరిసిల్ల అర్బన్‌, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి) : ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని దొంగత నం కేసులను ఛేదించడంతోపాటు కేసుల్లో సమగ్ర విచారణ చేపట్టి నిందితులకు శిక్షలు పడేలా పోలీస్‌ అధికారులు కృషి చేయాలని ఎస్పీ మహేష్‌ బీగీతే కోరారు. సిరిసిల్ల జిల్లా పోలీస్‌ కార్యాలయంలో మం గళవారం పోలీస్‌ అధికారులతో నేర సమీక్షా సమా వేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లాలోని పోలీస్‌ స్టేషన్‌ల వారీగా పెండింగ్‌ కేసులు, నిందితు ల అరెస్ట్‌లు, దర్యాప్తులో ఉన్న కేసులు, వారెంట్‌ల అమలు, పోలీస్‌ సిబ్బంది పనితీరులను ఎస్పీ సమ గ్రంగా సమీక్షించారు. ఇప్పటివరకు నమోదైన కేసు లు, పెండింగ్‌లో ఉన్న పాత కేసులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఎస్పీ ఆదేశించారు. వాటిని త్వర గా పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. నమోదైన ప్రతి కేసులో సమగ్ర విచా రణ చేపట్టి నిందితులకు శిక్షలు పడే విధంగా కృషి చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్యయం పాటిస్తూ బాధితులకు న్యాయం చేకూరేలా పని చేయాలన్నారు. ప్రాసిక్యూషన్‌లో భాగంగా కోర్టు జారీ చేసిన నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌లను తప్పిం చుకుని తిరుగుతున్న నిందితులపై పకడ్బందీగా అమలుచేయాలన్నారు. దొంగతనాల నివారణ కేసు ల ఛేదనపై సమీక్షిస్తూ, నేరస్తులను పట్టుకోవడంలో ఆధునిక సాంకేతికతలను వినియోగించుకుని కేసు లను ఛేదించి రికవరీ శాతం పెంచి బాధితులకు వారి సొత్తును తిరిగి అందించేలా చర్యలు తీసుకో వాలన్నారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ వ్యాపారులను భాగస్వామ్యం చేయలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మంగా చేపట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా పిల్లల రక్షణ, డ్రగ్స్‌ రహిత తెలంగాణ లక్ష్యంగా నిర్వహిస్తున్న వారోత్సవాల సందర్భంగా ప్రతి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో డ్రగ్స్‌ వల్ల కలిగే దుష్ప రిణామాలు, పిల్లల రక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నా రు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల పై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయాలని, పెట్రో లింగ్‌ చేసే సమయంలో ఆకస్మికంగా రౌడీ, హిస్టరీ షీట్స్‌ కలిగి ఉన్న వారిని తనిఖీలు చేయాలని ఆదే శించారు. గంజాయిని రవాణాచేసే వ్యక్తులతోపాటు సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమా దాల నివారణయే లక్ష్యంగా ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వాహనాల తనీఖీలు డ్రంకెన్‌ డ్రైవ్‌ తని ఖీలు చేపట్టాలని మద్యం సేవించి వాహనాలు నడు పుతూ ప్రమాదాలకు కారణమయ్యే వారిపై కఠినం గా వ్యవహరించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, అర్‌ఐలు తది తరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2026 | 12:12 AM