పోలీసుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
ABN , Publish Date - Sep 05 , 2026 | 12:46 AM
పోలీసుల సమస్యల పరిష్కారానికి నూతనంగా ఎన్నికైన కార్యవర్గం కృషి చేయాలని 17వ పోలీస్ బెటాలియన్ కమాండెంట్ పీజేసీ ఛటర్జీ కోరారు.
సిరిసిల్ల అర్బన్, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి) : పోలీసుల సమస్యల పరిష్కారానికి నూతనంగా ఎన్నికైన కార్యవర్గం కృషి చేయాలని 17వ పోలీస్ బెటాలియన్ కమాండెంట్ పీజేసీ ఛటర్జీ కోరారు. సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణ స్టేట్ పోలీస్ అఫీసర్స్ అసోసియేషన్ ఎన్నికలను డీజీపీ ఆదేశాల మేరకు సిరిసిల్ల 17వ పోలీస్ బెటాలియన్‌లో కమాండెంట్ ఛటర్జీ నేతృత్వంలో శుక్రవారం నిర్వహించారు. అధికారులు, సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఆర్‌ఐ కృష్ణయ్య, ఉపాధ్యక్షులుగా హెడ్‌కానిస్టేబుళ్లు రామకృష్ణ, నాగరాజు, ప్రధానకార్యదర్శిగా హెడ్‌కానిస్టేబుల్ హరికృష్ణ, సహాయ కార్యదర్శిగా హెడ్ కానిస్టేబుల్ కిరణ్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా హెడ్‌కానిస్టెబుల్ కిరణ్‌కుమార్, కోశాధికారిగా కాని స్టేబుల్ మహేష్, ఎగ్జిక్యూటీవ్ సభ్యులుగా ఆర్‌ఎస్‌ఐ భాను, హెడ్‌కానిస్టే బుల్ ప్రమోద్, కానిస్టేబుళ్లు దేవేందర్, శ్రీకాంత్, అనంద్, రాకేష్‌లు ఎన్నిక య్యారు. వీరికి కమాండెంట్ పూలమొక్కలను అందించి అభినందించారు. ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన అసోసి యేషన్ కార్యవర్గం పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ సమస్య లను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.