నిందితులకు శిక్షలు పడేలా కృషి చేయాలి
ABN , Publish Date - Jul 14 , 2026 | 11:45 PM
ప్రతి కేసులో దర్యాప్తును వేగవంతంగా చేసి శాస్త్రీయ ఆధారాలతో నాణ్యమైన విచారణలు చేపట్టి నిందితులకు శిక్షలు పడేలా కృషి చేయాలని ఎస్పీ మహేష్ బీగీతే ఆదే శించారు.
సిరిసిల్ల అర్బన్, జూలై 14 (ఆంధ్రజ్యోతి) : ప్రతి కేసులో దర్యాప్తును వేగవంతంగా చేసి శాస్త్రీయ ఆధారాలతో నాణ్యమైన విచారణలు చేపట్టి నిందితులకు శిక్షలు పడేలా కృషి చేయాలని ఎస్పీ మహేష్ బీగీతే ఆదే శించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం సిరిసిల్ల సబ్ డివి జన్ పోలీస్ అధికారులతో కేసుల పురోగతిపై సమీక్ష సమావేశాన్ని నిర్వ హించారు. పెండింగ్ కేసుల దర్యాప్తు పురగోతి, నిందుతుల అరెస్ట్‌లు, నాన్-బెయిలబుల్ వారెంట్ల అమలు, శాంతిభధ్రతల నిర్వహణ, పోలీసుల పనితీరును సమగ్రంగా అధికారులను అడిగితెలుసుకుని సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి కేసులో శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలు, ఫోరెన్సిక్ సాక్ష్యాలు, డిజిటల్, ఎవిడెన్స్‌ను సమర్థవంతంగా విని యోగించాలని సూచించారు. నాణ్యమైన దర్యాప్తు ద్వారానే కోర్టుల్లో నింది తులకు శిక్షలు పడుతాయని బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరు గుతుందన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదులపై స్పందించి చట్ట పరిధిలో బాధితులకు సత్వర నాయం అందించాలని అదేశించారు. పెట్రో లింగ్ సమయంలో అనుమానితులు, పాత నేరస్థులు, రౌడీషీటర్‌లను మొ బైల్ సెక్యూరిటీ చెక్ డివైస్‌తో తప్పనిసరిగా తనీఖీలు చేసి నేరాల నియం త్రణను మరింత సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు. సైబర్ నేరా లపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు.గంజాయి, గుడుం బా, పేకాట, పీడీఎస్ రైస్ అక్రమ రవాణా, ఇసుక రవాణాలపై ప్రత్యేక నిఘా ఉంచి దాడులు చేసి అడ్డుకట్టు వేయాలన్నారు. ఈ సమావేశంలో డీఎస్పీలు నాగేంద్రచారీ, వెంకటేశ్వర్లు, సీఐలు శ్రీనివాస్, నాగేశ్వర్‌రావు, వెంకటేష్, మొగిలి, మధుకర్, అర్‌ఐ సురేష్, ఎస్‌ఐలు పాల్గొన్నారు.