Share News

గ్రామ, వార్డు సభల విజయవంతానికి కృషి

ABN , Publish Date - Jun 04 , 2026 | 12:19 AM

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈనెల 4,6,8,10 తేదీలలో నిర్వహించ తలపెట్టిన ప్రత్యేక గ్రామ, వార్డు సభలను విజయవం తంగా నిర్వహించాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అధికారులను ఆదేశించారు.

గ్రామ, వార్డు సభల విజయవంతానికి కృషి

సిరిసిల్ల, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈనెల 4,6,8,10 తేదీలలో నిర్వహించ తలపెట్టిన ప్రత్యేక గ్రామ, వార్డు సభలను విజయవం తంగా నిర్వహించాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిష నర్లు, మండల వ్యవసాయ అధికారులు, ఎంపీవోలతో అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌తో కలిసి కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. పరి పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రతి గ్రామం, వార్డులో సభలు నిర్వహించి, ప్రజలతో ప్రత్యక్షంగా చర్చించాలని, సంబం ధిత శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచిం చారు. గ్రామ సభల వేదికగా పంటల మార్పిడి, ఆయిల్‌పామ్‌ సాగు, ఫార్మర్‌ రిజిస్ట్రీ, సన్న వడ్ల సాగు తదితర అంశాలపై రైతు లకు విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. లాభదాయక పంటగా ఆయిల్‌పామ్‌ సాగు విస్తరణకు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణ కార్యక్ర మాలను ప్రభావవంతంగా అమలు చేయాలని, కంపోస్ట్‌ షెడ్లను సక్ర మంగా నిర్వహించి పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో చేపట్టాల్సిన పనులను ముందుగానే గుర్తించి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలని, మిషన్‌ భగీరథ ట్యాంకులను శుభ్రపరచాలని ఆదేశించారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టడంతో పాటు ఫాగింగ్‌ యంత్రాలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. వనమహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయా లని, నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలు నాటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. మొక్కలు నాటేందుకు ముందు గానే గుంతలు సిద్ధం చేయడంతో పాటు నర్సరీల నిర్వహణ, ఎవెన్యూ ప్లాంటేషన్‌ కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సభల్లో బడి బాట కార్యక్రమంపై విస్తృత ప్రచారం నిర్వహించాలని, మండల విద్యాధికారులు, ఇంటర్‌ విద్యాధికారులు ప్రభుత్వ పాఠ శాలలు, కళాశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. విద్యాసంస్థల పునః ప్రారంభానికి ముందే పరిశుభ్రత పనులు పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. జనగణన నిర్వహణలో ఛార్జ్‌ అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని, ఎన్యూమరేటర్లకు పూర్తి స్థాయి అవగాహన ఉండేలా చూడాలని కలెక్టర్‌ తెలిపారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభమయ్యే షెడ్యూల్‌ ప్రకారం శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఎస్‌ఐఆర్‌ మ్యాపింగ్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని, ప్రజలకు కలిగే సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు.14 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపిస్తే సరిపోతుందని ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. బీఎల్‌వోలు అప్రమత్తంగా వ్యవహరించాలని, అంగన్‌వాడీ సిబ్బంది, మున్సిపాలిటీల్లోని ఆర్డీవోలు తహసీల్దార్లకు సహకరించాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సభలకు జన సమీకరణ చేపట్టాలని, ఎజెండా ప్రకారం ప్రతీ అంశంపై చర్చించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో జిల్లా వేములవాడ ఆర్డీవో కేఎస్‌బీ కుమారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్‌ బేగం, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి లక్ష్మీనారాయణ, జిల్లా పంచాయతీ అధికారి షర్ఫుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 04 , 2026 | 12:19 AM