రాయికల్ పట్టణ అభివృద్ధికి కృషి
ABN , Publish Date - Jan 30 , 2026 | 01:01 AM
రాయికల్ పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్
రాయికల్, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): రాయికల్ పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. రాయికల్ పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు మహేంద్ర బాబు జగిత్యాల ఎమ్మెల్యేగా డాక్టర్ సంజయ్ కుమార్ 2023లో గెలుపొందాలని వేంకటేశ్వర స్వామివారిని మొక్కుకోగా ఎమ్మెల్యే నిలువెత్తు బెల్ల జోకి తులాభారం సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని అన్నారు. అలాగే హనుమాన్ ఆలయం, గుడికోట ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. రాయికల్ పట్టణ అభివృద్ధికి రూ.15 కోట్లు మంజూరు చేయగా, ఇటీవల మంత్రితో కలిసి రూ.7 కోట్ల 20 లక్షల అభివృద్ధి పనులకు భూమిపూజ చేస్తామన్నారు. అన్ని వర్గాల ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి అన్ని వర్గా సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు, మాజీ వైస్ చైర్మన్ గండ్ర రమాదేవిఅచ్యుత రావు, పడిగెల రవీందర్ రెడ్డి, కోల శ్రీనివాస్ గౌడ్, ఆలయ చైర్మన్ గంగాధర్, మహేంద్ర బాబు, మోర రామ్మూర్తి, రాయికల్ పట్టణ, మండల నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.