పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి కృషి
ABN , Publish Date - Jan 20 , 2026 | 11:54 PM
పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని ఎస్పీ మహేష్ బీ గీతే పోలీస్ అధికారులను ఆదేశించారు.
సిరిసిల్ల, జనవరి 20 (ఆంధ్ర జ్యోతి): పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని ఎస్పీ మహేష్ బీ గీతే పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీస్ కా ర్యాలయంలో నేర సమీక్ష నిర్వ హించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కేసుల విచారణలో జాప్యం జరిగి తే సహించేదిలేదని స్పష్టం చేశారు.పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరంగా పరిష్కరించేందుకు న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ బా ధితులకు న్యాయం చేకూరేలా బాధ్యతాయుతం గా వ్యవహరించాలన్నారు. ప్రాసిక్యూషన్‌లో భా గంగా కోర్టు వారు జారీ చేసిన నాన్ బెయిలబు ల్ వారెంట్లను నిందితులపై, తప్పించుకుని తిరుగుతున్న నేరస్తులపై పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా జరి గేలా అధికారులు అందరూ బాధ్యతాయుతంగా తమ విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. ఎ లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుం డా ఎన్నికల నియమావళిని కట్టుదిట్టంగా అమ లు చేస్తూ పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగిం చుకునేలా భద్రతాపరమైన అన్ని చర్యలు చేప ట్టాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై ఉక్కుపాదం మోపాలని, ప్రతిరోజు రౌడి, హిస్టరీ షీటర్స్‌ను తనిఖీ చేస్తూ వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముం దస్తుగా చర్యలు తీసుకోవాలని సూచించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు, మట్కా, జూదం, అక్రమ ఇసుక రవాణా లాంటి అసాం ఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యే క నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవా లని సూచించారు. గంజాయిని రవాణా చేసే వ్యక్తులతో పాటు గంజాయిని సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. డ్రంకెన్‌డ్రైవ్, బహి రంగ ప్రదేశాల్లో మద్యపాన సేవనంపై కఠినం గా వ్యవహరించాలని, పోలీస్‌స్టేషన్ల పరిధిలో ప్రతిరోజు వాహనాల తనిఖీలు చేపట్టాలన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంపై విస్తృతంగా అవ గాహన కల్పించాలని, నో హెల్మెట్ నో పెట్రోల్ పై వాహనదారులకు అవగాహన కల్పించాల న్నారు. ఈసమావేశంలో వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయి ఐపీఎస్.అదనపు ఎస్పీ చంద్ర య్య, డిఎస్పీ నాగేంద్రచారి, సీఐలు కృష్ణ, మొ గిలి, శ్రీనివాస్, వీరప్రసాద్, వేంకటేశ్వర్లు, శ్రీని వాస్, నాగేశ్వరరావు, రవి, మధుకర్, ఆర్‌ఐలు మధుకర్, యాదగిరి, రమేష్, ఎస్‌ఐలు ఐటీకోర్ సిబ్బంది పాల్గొన్నారు.