Share News

విద్యాలయాలు, పాఠశాలలను శుభ్రంగా ఉంచాలి

ABN , Publish Date - Jun 24 , 2026 | 12:12 AM

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అన్ని పాఠశాలలు, రెసిడెన్షియల్‌ విద్యాలయాలను నిత్యం శుభ్రంగా ఉంచడంతోపాటు మెనూ ప్రకా రం నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించా లని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అధికారులను ఆదే శించారు.

విద్యాలయాలు, పాఠశాలలను శుభ్రంగా ఉంచాలి

సిరిసిల్ల అర్బన్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి ) : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అన్ని పాఠశాలలు, రెసిడెన్షియల్‌ విద్యాలయాలను నిత్యం శుభ్రంగా ఉంచడంతోపాటు మెనూ ప్రకా రం నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించా లని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అధికారులను ఆదే శించారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో మంగళవా రం రాత్రి విద్యాశాఖ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సంక్షేమ గురుకులాలు, గురుకుల విద్యాలయా లు, ప్రభుత్వ పాఠశాలలు, మోడల్‌ స్కూళ్లు, ఏక లవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ విద్యాలయాల అధి కారులతో సమీక్షా సమావేశాన్ని అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌తో కలిసి సమీక్షించారు. కలెక్టర్‌ గరి మ అగ్రవాల్‌ మాట్లాడుతూ ప్రతి పాఠశాల, రెసి డెన్షియల్‌ విద్యాలయాల్లో తప్పనిసరిగా ప్రభుత్వ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం విద్యార్థుల కు అందించాలని సూచించారు. దీని కోసం పక డ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆహార పదార్థాలు జాగ్రత్తగా భద్రపర్చాలని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ఆహార పదార్థాలు సరఫరా చేయాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు, రెసిడెన్షియల్‌ విద్యాలయాలు పరిశుభ్రంగా ఉండాలని స్పష్టం చేశారు. దీనిపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని సూచించారు. అన్ని విద్యాలయాల్లో విద్యార్థులు వంద శాతం హాజరు అయ్యేలా చూడాలని ఆదే శించారు. ప్రణాళిక ప్రకారం విద్యా బోధన చేయాలని తెలి పారు. గతంలో నియమించిన ప్రత్యే క అధికారులు షెడ్యూల్‌ ప్రకారం తమ పరిధిలోని పాఠశాలలు, రెసిడె న్షియల్‌ విద్యా లయాల్లో తనిఖీ చేయాలని ఆదే శించారు. ఈ సమా వేశంలో జిల్లా విద్యాధికారి జగన్‌ మోహన్‌ రెడ్డి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్‌ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారి సౌజన్య, డీటీడబ్ల్యూవో సంగీత, మైనార్టీ సంక్షే మ శాఖ అధికారి అయేషా తలత్‌, జిల్లా వైద్యాఽ దికారి ఏంజెలా ఆల్ర్ఫెడ్‌, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ అనూ ష, ఈఎంఆర్‌ఎస్‌ ప్రిన్సిపాళ్లు, అధికారులు తది తరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 24 , 2026 | 12:12 AM