ఘనంగా విద్యా వారోత్సవాలు
ABN , Publish Date - May 10 , 2026 | 12:05 AM
ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 11నుంచి 17వరకు జిల్లా వ్యాప్తంగా విద్యావారోత్సవాలను ఘనంగా నిరహిం చాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశించారు.
సిరిసిల్ల అర్బన్, మే 9(ఆంధ్రజ్యోతి) : ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 11నుంచి 17వరకు జిల్లా వ్యాప్తంగా విద్యావారోత్సవాలను ఘనంగా నిరహిం చాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశించారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో శనివారం రాత్రి జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్ సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడారు. 99రోజుల ప్రత్యేక ప్రణాళిక విద్యావారోత్సవాలు, ధాన్యం కొనుగోలు ప్రక్రియ, జనగణన సెల్ఫ్ ఎన్యూమరేషన్, ఫార్మర్ రిజిస్ట్రీ తదితరి అంశాలపై కలెక్టర్ గరిమ అగ్రవాల్ తో సమీక్షించారు. ఈ సందర్భంగా రామకృష్ణారావు మాట్లా డుతూ, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగం గా విద్యా వారోత్సవాలు ఈనెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఏడు రోజుల పాటు ప్రణాళికకు అనుగుణంగా నిర్వ హించాలన్నారు. ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. జనగణన ప్రక్రియకు సంబంధించి, సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలన్నారు. వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని వివరించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటవెంటనే తరలింపు చేపట్టాలని వివరించారు. తగినన్ని గోనె సంచులు, లారీలు, తగినంత మంది హమాలీలను అందుబా టులో ఉంచుకోవాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా విద్యాశాఖ అధికారి జగన్‌మోహన్‌రెడ్డి, డీఐఈవో శరత్, సీపీవో శ్రీని వాసచారి, డీఏవో అఫ్జల్ బేగం, డీటీవో లక్ష్మణ్, డీసీవో రామకృష్ణ, పౌర సరఫరాల అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, సహాయ లేబర్ అధికారి నజీర్, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీబేగ్, అదనపు డీఆర్డీ వో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.