లోపాలమయంగా విద్యా కమిషన్ నివేదిక
ABN , Publish Date - Feb 28 , 2026 | 11:45 PM
తెలంగాణ విద్యా కమిషన్ నివేదికలో అన్ని లోపాలే ఉన్నాయని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి విమర్శించారు.
భగత్‌నగర్, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ విద్యా కమిషన్ నివేదికలో అన్ని లోపాలే ఉన్నాయని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి విమర్శించారు. శనివారం నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నివేదికపై విద్యార్థి సంఘాలు, మేధావులు, విద్యావంతులతో చర్చలు జరపాలన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప ఎటువంటి అభివృద్ధి పనులు చేయడ లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం విభజన హామీల ప్రకారం రాష్ట్రంలో విద్యాసంస్థలను ఏర్పాటు చేయడం లేదన్నారు. రాష్ట్రం నుంచి కేబినెట్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రలు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్, ఉప్పల శాంతికుమార్, బోయిని విష్ణు, ఆడప సాయికృష్ణ, వినయ్‌రెడ్డి, అరవింద్, రాహుల్ పాల్గొన్నారు.