ప్రజా ప్రభుత్వంలో విద్య, వైద్యానికి పెద్ద పీట
ABN , Publish Date - Apr 10 , 2026 | 12:31 AM
ప్రజా ప్రభుత్వం లో విద్య, వైద్యానికి పెద్ద పీట వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.
చందుర్తి, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): ప్రజా ప్రభుత్వం లో విద్య, వైద్యానికి పెద్ద పీట వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. చం దుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశా లలో 18 లక్షల43 వేల నిధులతో పలు అభివృద్ధి కార్యక్ర మాలకు గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం 99 మంది లబ్ధిదారులకు 32లక్షల 45 వేల విలువ గల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వంలో ఒక వైపు సంక్షేమం మరో వైపు అభివృద్ధి రెండు సమాంతరంగా జరుగుతున్నాయని అన్నారు. గతంలో మల్యాల గ్రామం లో నిర్వహించిన ప్రజాపథం ఇందిరమ్మ గ్రామసభ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా 1737 కోట్లు నిధులు మంజూరుచేశారన్నారు. వారి హయాంలో రుద్రంగి నాగారం చెరువు, మర్రిపల్లి, చందుర్తి ప్రాజెక్ట్ లు ఆనాడే పూర్తిచేశామన్నారు. గత పది సంవత్సరాలలో వేములవాడ ప్రాంతంలో ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేద న్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో ఉన్న చొరవతో ఒకే మండలంలో చందుర్తి, రుద్రంగి గ్రామాల్లో రెండు జూనియర్ కళాశాలలను మంజూరుచేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వం విద్యను నిర్లక్ష్యం చేసిందన్నారు. ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో ప్రతి ఒక్క విద్యార్థికి ఒకే మెనూ ఉండేలా డైట్‌ప్లాన్ అమలు చేశారని, అలాగే డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచారన్నారు. రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు పోషక పదార్థాలతో కూడిన ఆహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వ సంకల్పించిందన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆరో గ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారని, ప్రస్తుత ప్రజా ప్రభు త్వంలో ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంచామన్నారు. క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్‌లైన్ సెంటర్ ఏర్పాటుచేసి పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి సహా యనిధి, ఎల్వోసీలను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకుపోతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉచిత బస్సు ద్వారా సుమారు 10వేల కోట్ల రూపాయల ప్రయా ణాలు అయ్యాయన్నారు. నూతన రేషన్ కార్డులు మం జూరుచేశామన్నారు. చందుర్తి మోత్కరావుపేట రోడ్డు నిర్మాణం కోసం టెండర్లు పూర్తయ్యాయని త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. హమ్ పథకం ద్వారా వేములవాడ నుంచి సిరికొండ మధ్య 100 ఫిట్ల వరకు రోడ్డు నిర్మాణానికి 160 కోట్లు మంజూరు చేయ డం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే కేటీఆర్, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ తాము తెచ్చా మని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నియోజకవర్గ పరిధిలోని హన్మజీపేట నుండి అజ్మరా తండా వరకు 25 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణం చేపడు తున్నట్లు తెలిపారు.
రోల్ మోడల్‌గా ఆత్మీయ భరోసా పథకం
దేశంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాలకు ఒక రోల్ మోడల్‌గా నిలిచిందని వెల్లడించారు. దేశంలో ఏ రాష్ట్రం లో లేని విధంగా కోటి 15లక్షల మంది రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు త్వరలో 5లక్షల జీవిత బీమా కల్పించను న్నామని పేర్కొన్నారు. రైతులకు ఏకకాలంలో రూ.2లక్షల వరకు రుణమాఫీ చేశామన్నారు. ప్రజా ప్రభుత్వంలో నూతన రేషన్ కార్డు ఇస్తు న్నామని వివరించారు. రూ. 14,600కోట్లు ఖర్చు చేసి రాష్ట్రంలో రేషన్ కార్డుదారుల కు సన్నం బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. 200యూనిట్ల వరకు ఉచిత వి ద్యుత్, సన్న వడ్లకు బోనస్ ఇస్తున్నామని తెలిపారు.
ప్రత్యేక బస్సు సర్వీసులు
కళాశాలకు రామన్నపేట, సనుగుల నుంచి వచ్చే విద్యార్థులకు బస్సు సౌక ర్యం కళాశాల వరకు పొడిగించాలని విప్‌ను అధ్యాపకులు కోరగా వెంటనే స్పందించినన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆర్టీసీ డిపో మేనేజర్‌తో ఫోన్‌లో మాట్లాడి రామన్నపేట వరకు వచ్చే బస్సు చందుర్తి వరకు, సనుగుల నుంచి వేములవాడ వెళ్లే బస్సును విద్యార్థులకు ఉపయోగపడేలా చందుర్తి ప్రభుత్వ కళాశా ల వరకు పొడిగించాలని సూచించారు.
సర్వే చేసి నివేదికలు ఇవ్వాలి
భవిష్యత్తు అవసరాల కోసం మండల కేంద్రంలో సర్వే నంబర్‌లో మూడు రోజుల్లో సర్వే చేసి నివేదికలు ఇవ్వాల ని విప్ తహాశీల్దార్ భూపతికి సూచించారు. అధికారులు శ్రద్ధతో పని చేయాలన్నారు. పేద ప్రజలకు ఇచ్చిన ప్రభు త్వ భూములను ముట్టుకోవద్దన్నారు. చందుర్తి మండలా న్ని అన్ని రంగాల అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ భూపతి, ఎంపీడీవో రాధ, సర్పంచ్‌లు పులి సత్తయ్య, కట్కం మల్లేశం, బొజ్జ మల్లేశం, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ కృష్ణకర్, నాయకులు నాగం కుమార్, చింతపంటి రామస్వామి, గొట్టె ప్రభాకర్, దూది శ్రీనివాసరెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, బాలు, మల్లేశం, చంద్రం, అజయ్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.