ఈడీ దాడులు.. కక్ష సాధింపు చర్యలే..
ABN , Publish Date - May 28 , 2026 | 11:51 PM
కేరళ మాజీ సీఎం పినరయివిజయన్ ఇంటిపై ఈడీ దాడు లు చేయడం రాజకీయ కక్ష సాధింపు చర్యలనే అని ఇందులో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ప్రమేయం ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి ముషం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిరిసిల్ల అర్బన్, మే 28 (ఆంధ్రజ్యోతి) : కేరళ మాజీ సీఎం పినరయివిజయన్ ఇంటిపై ఈడీ దాడు లు చేయడం రాజకీయ కక్ష సాధింపు చర్యలనే అని ఇందులో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ప్రమేయం ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి ముషం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల పట్టణం బీవైనగర్‌లోని అమృ త్‌లాల్ శుక్లా కార్మిక భవనంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ముశం రమేష్ మాట్లాడారు. ఎన్నికలు ముగిసిన వెంటనే కేరళ అధికార పార్టీ కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కలిసి కేరళలో సీపీఎం ప్రతిష్టను దెబ్బతీ యాలనే సీపీఎం నాయకుల ఇళ్లపై ఈడీ దాడులను కేంద్ర ప్రభుత్వం బీజేపీ చేయించిందన్నారు. సీపీఎం ముఖ్యమంత్రులు చేసిన జ్యోతిబస్, మాణిక్ సర్కార్ ఎంత నిజాయితీగా, నిస్వార్ధంగా అవినీతికి పాల్పడకుండా పరిపాలన సాగించారని, 25 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న మాణిక్ సర్కార్ సొంత ఇళ్లు కూడా కొనుక్కోలేదన్నారు. ఇప్పటికి ఆయన పార్టీ ఆఫీసులో ఉంటున్నారని అన్నారు. కేరళలో విజయన్ పదేళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినా కూడా సొంత ఇల్లు లేక అద్దె ఇంట్లో ఉంటున్నాడని అన్నారు. అలాంటి వారిపై తప్పుడు ఆరోపణ చేస్తూ బీజేపీ నీచమైన రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. నిజంగా ఈడీ అధికారులకు. దమ్ము, ధైర్యముంటే బీజేపీలో ముఖ్యమంత్రి, మంత్రులుగా ఉన్నత పదవుల్లో కొనసాగుతున్న ఎంతోమంది నాయకులపై అవినీతి కేసులు ఉన్నాయని, వారిపై దాడులు నిర్వహించి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీలో ఉన్నవారు ఎన్ని అవినీతికి అక్రమాలు పాల్పడినా ఈడీ అధికారులకు కనబడదని, కానీ ప్రతిపక్షంలో ఉన్నవారు బీజేపీ ప్రభుత్వాన్ని ఎదిరిస్తే మాత్రం ఏ తప్పు చేయకుండా దాడులు నిర్వహి స్తూ అరెస్టులకు పాల్పడుతూ ఇబ్బందులు అధికారులు చేస్తున్నార న్నారు. సీపీఎం నాయకులు ఇలాంటి దాడులు, అక్రమ అరెస్టులకు ఎన్నడూ భయపడరన్నారు. బ్రిటీష్ కాలంలోనే నిర్బంధాన్ని ఎదుర్కొని పోరాటం చేసిన కమ్యూనిస్టు నాయకుల ముందు ఇలాంటి చిల్లర పనులు మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి, కోడం రమణ, జిల్లా నాయకులు అన్నదాస్ గణేష్. పట్టణ కార్యదర్శి ఎలిగేటి రాజశేఖర్ తది తరులు పాల్గొన్నారు.