ఇందిరా మహిళా శక్తితో ఆర్థిక ప్రగతి..
ABN , Publish Date - Jul 04 , 2026 | 12:04 AM
ఇందిరా మహిళా శక్తి యూనిట్లు మహిళా సంఘాల ఆర్థిక ప్రగతికి దోహదపడుతున్నాయని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు.
తంగళ్లపల్లి, జూలై 3 (ఆంధ్రజ్యోతి): ఇందిరా మహిళా శక్తి యూనిట్లు మహిళా సంఘాల ఆర్థిక ప్రగతికి దోహదపడుతున్నాయని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో స్వయం సహాయక సం ఘాల మహిళలు వెంకటసాయి కోల్డ్ ప్రెస్ ఆయిల్, ఫ్లోర్‌మిల్ యూనిట్, కోవిదా మిల్స్ పాయింట్ ఏర్పాటు చేసుకోగా శుక్రవారం కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రారింభించారు. వాటి పనితీరు, ఉపాధి, ఆదాయం తదితర వివ రాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లడుతూ ఇందిరా మహిళా శక్తి కింద రెండు యూనిట్లు ప్రారంభించామని తెలిపారు. ఒక యూనిట్‌లో కోల్డ్ ప్రెస్సింగ్ ఆయిల్, పిండిగిర్ని, ఇతర దాదాపు ఆరు యం త్రాలు ఏర్పాటు చేశారని తెలిపారు. దాదాపు రూ.11.50లక్షల వ్యయంతో యూనిట్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. పీఎంఎఫ్ కింద రూ.3.50లక్షల సబ్సీడి అందుతుందని అన్నారు. అలాగే మరో మహిళ డెయిరీ యూనిట్‌ను ఏర్పాటు చేసుకున్నారని, దీనిక మహిళా సంఘాల నుంచి సుమారు రూ. 5లక్షల రుణం ఇప్పించామని తెలిపారు. జిల్లాలో ఇలాంటి మరిన్ని యూని ట్లు ఏర్పాటు చేసేందుకు మహిళలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. యూనిట్లు ఏర్పాటు చేయడంతో ఉపాధితో పాటు మహిళా సాధికారతకు దోహదపడుతుందని వెల్లడించారు. బ్యాంకర్ల సమావేశంలో చర్చించి మహి ళా సంఘాలకు రుణాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. జిల్లాలోని గ్రామీణ మహిళా, పురుష అభ్యర్ధులకు ఉచిత రెసిడెన్సియల్ శిక్షణ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆర్ సేథీ అధ్వర్యంలో అందుబాటులో ఉంద ని వెల్లడించారు. శిక్షణను యువత సద్వినియోగం చేసుకోవాలని, ఆర్థికం గా రాణించేందుకు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో డీఆర్డీవో లక్ష్మీనారాయణ, లీడ్ డిస్ట్రిక్ మేనేజర్ మల్లికార్జున రావు, మార్కె ట్ కమిటీ వైస్‌చైర్మన్ నేరళ్ల నర్సింగం, ఇన్‌చార్జీ తహసీల్దార్ మురళీ, ఇన్ చార్జీ ఎంపీడివో రమేష్, ఎంపీవో మీర్జా, స్థానిక సర్పంచ్ లక్ష్మీరాజం తదిత రులు పాల్గొన్నారు.