Share News

నిబద్ధతతో విధులు నిర్వర్తించాలి

ABN , Publish Date - Oct 14 , 2026 | 11:57 PM

జిల్లాలో ప్రజలకు అందుబాటులో ఉండి నిబద్ధతతో విధులను నిర్వర్తించాలని ఎస్పీ మహేష్‌ బీగీతే ఆదేశించారు.

నిబద్ధతతో విధులు నిర్వర్తించాలి

సిరిసిల్ల అర్బన్‌, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ప్రజలకు అందుబాటులో ఉండి నిబద్ధతతో విధులను నిర్వర్తించాలని ఎస్పీ మహేష్‌ బీగీతే ఆదేశించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో బుధ వారం నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పోలీస్‌ స్టేషన్‌ల వారీగా పెండింగ్‌ కేసుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భం గా ఎస్పీ మాట్లాడుతూ ఆయా కేసుల్లో నిందితుల అరెస్టు, దర్యాప్తు పురోగతి, సాక్ష్యాధారాల సేకరణ, ఛార్జీషీట్‌ దాఖలు తదితర అంశా లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌ కేసుల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తూ, ప్రతి కేసులో నిర్ణీత కాలవ్య వధిలో దర్యాప్తు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పోలీస్‌ అధికారి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ నిబద్ధతతో, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విధులు నిర్వహించా లని ఆదేశించారు. విధులపై నిర్లక్ష్యం వహించే అధికారులపై శాఖా పరమైన చర్యలు తప్పవని, అదే సమయంలో సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా పనిచేసే అధికారులకు పోలీస్‌ శాఖ ఎల్లప్పు డూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి అధికారి తన పరి ధిలోని సిబ్బంది పనితీరు, ప్రవర్తన, విధుల నిర్వహణతో పాటు వారి కదలికలపై నిరంతరం పర్యవేక్షణ కలిగి ఉండాలన్నారు. ప్రజ లనుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ, చట్టపరిధిలో సమస్యలను పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్‌ కేసులను త్వరగా పరిష్కం చాలని, అవసమైతే సంబంధిత న్యాయమూర్తులను స్వయంగా కలిసి కేసుల పరిష్కారానికి మరింత చొరవ చూపాలన్నారు. దుర్గా మాత నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టా లని ఆదేశించారు. నిమజ్జన శోభాయాత్ర ముగిసే వరకు ఉత్సవ నిర్వాహకులు, కమిటీ సభ్యులతో సమన్వయం చేసుకుంటూ శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చూడాలని సూచిం చారు. ఈ సమావేశంలో డీఎస్పీలు నాగేంద్రచారీ, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు , సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 14 , 2026 | 11:57 PM