Share News

ప్రజలకు మరింత చేరువయ్యేలా విధులు

ABN , Publish Date - Jul 28 , 2026 | 11:50 PM

ప్రజలకు మరింత చేరువయ్యేలా పోలీస్‌ విధులు ఉండాలని, ప్రతి ఫిర్యాదుపై తక్ష ణమే స్పందించి బాధితులకు చట్ట ప్రకా రం న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవా లని ఎస్పీ మహేష్‌ బి. గితే అన్నారు.

ప్రజలకు మరింత చేరువయ్యేలా విధులు

వేములవాడ, జూలై 28 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు మరింత చేరువయ్యేలా పోలీస్‌ విధులు ఉండాలని, ప్రతి ఫిర్యాదుపై తక్ష ణమే స్పందించి బాధితులకు చట్ట ప్రకా రం న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవా లని ఎస్పీ మహేష్‌ బి. గితే అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా వేములవాడ పట్టణ పోలీస్‌ స్టేషన్‌ను మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీరించి, వారు ప్రదర్శించిన ఫుట్‌డ్రిల్‌, లాఠీ డ్రిల్‌ను, వారికి కేటాయించిన కిట్‌ ఆర్థికల్స్‌ని పరిశీ లించారు. అనంతరం స్టేషన్‌లోని పలు విభాగాల రికార్డులు, రిజిస్టర్‌, క్రైమ్‌ రికార్డులు, జనరల్‌ డైరీ, ఆర్మ్‌ రూమ్‌, స్టోర్స్‌, లాకప్‌ రూమ్‌లను క్షుణ్ణంగా పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న కేసులను సమగ్రంగా సమీక్షిస్తూ, విచారణలో ఉన్న కేసుల పురగతిని అధికారులను అడిగితెలుసుకున్నారు. స్టేషన్‌ పరిధి లోని శాంతిభద్రతల పరిస్థితులు, నేరాల స్థితిగతులపై సవివరంగా అధికా రులను అడిగి తెలుసుకున్నారు. తదనంతరం ఎస్పీ మాట్లాడుతూ కేసుల విచారణలో త్వరితగతిన దర్యాప్తు, సాక్ష్యాల సేకరణలో నిష్పక్షపాత దృక్పథం అవసరమని తెలిపారు. పోలీస్‌ స్టేషన్‌ అధికారులు, సిబ్బంది పనితీరు భేషుగ్గా ఉందని అభినందించారు. పోలీస్‌ స్టేషన్‌ పరిసర ప్రాంతాల్లో 5ఎస్‌ విధానాన్ని పాటిస్తూ పరిశుభ్రతను కాపాడాలని, ఫైళ్లన క్రమపద్ధతిలో నిర్దేశి త ప్రదేశాల్లో ఉంచాలని, ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని, విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవ ని సూచించారు. పోలీస్‌ శాఖ వినియోగిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞా నంపై అధికారులు,సిబ్బందికి పూర్తి అవగహన ఉండాలన్నారు. విలేజ్‌ పోలీసింగ్‌లో భాగంగా పోలీస్‌ అధి కారులు, సిబ్బంది తరచూ గ్రామా లు పర్యటిస్తూ ప్రజలతో సత్సంబం ధాలు కొనసాగిస్తూ ఇన్ఫర్మేన్‌ వ్యవ స్థను మరింత పటిష్టం చేయాలని, అలాగే మహిళల భద్రత, సైబర్‌ నేరాల నివారణ, మాదక ద్రవ్యాల నిర్మూలన, వాటి వల్ల కలిగే అనర్థా లపై అవగాహన కల్పించాలన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వేముల వాడకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్టేషన్‌ పరి ధిలో, ముఖ్యంగా దేవాలయ పరిసరాల్లో విజిబుల్‌ పోలీసింగ్‌ను మరింత పటిష్టంగా అమలు చేస్తూ పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని అధికా రులను ఆదేశించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా ముందస్తూ చర్యలు చేపట్టి, ట్రాఫిక్‌ నిర్వహణను సమర్థ వంతంగా చేపట్టాలని ఆదేశించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల పట్ల, రౌడి షీటర్లపట్ల కఠినంగా వ్యవహరిస్తూ, వారి కార్యకలాపా లపై నిరంతరం నిఘా ఉంచాలని, చట్టవ్యతిరేక కార్యర:ఫమాలైన గంజాయి, పేకాట, పీడిఎస్‌ రైస్‌ వాటిపై ప్రత్యేక దృష్టిసారించి వాటి నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా పోలీస్‌ స్టేషన్‌ ఆవ రణలో పోలీస్‌ సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. ఎస్పీ వెంట డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ వీరప్రసాద్‌, ఎస్సైలు ప్రేమనందం, శ్రీనివాస్‌, ట్రాఫిక్‌ ఎస్సై రాజు ఉన్నారు.

Updated Date - Jul 28 , 2026 | 11:50 PM