పంపిణీకి సిద్ధమవుతున్న డబుల్ బెడ్‌రూం ఇళ్లు
ABN , Publish Date - Jun 27 , 2026 | 12:52 AM
జిల్లాలోని కాల్వశ్రీరాంపూర్, ఓదెల మండల కేం ద్రంలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు పంపిణీకి సిద్ధమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలోనే ఇళ్ల నిర్మాణాలు పూర్తయి నప్పటికీ, మౌలిక వసతులు కల్పించని కారణంగా వాటిని ఎవరికి పంపిణీ చేయలేక పోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం పేద, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం డబుల్ బెడ్‌రూముల ఇళ్ల నిర్మా ణాలు చేపట్టి ఇస్తామని ప్రకటించింది.
- అందుబాటులోకి 388 గృహాలు
- మౌలిక వసతులకు రూ.2.14 కోట్ల ఖర్చు
- లబ్ధిదారుల ఎంపిక జరగడమే ఆలస్యం
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
జిల్లాలోని కాల్వశ్రీరాంపూర్, ఓదెల మండల కేం ద్రంలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు పంపిణీకి సిద్ధమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలోనే ఇళ్ల నిర్మాణాలు పూర్తయి నప్పటికీ, మౌలిక వసతులు కల్పించని కారణంగా వాటిని ఎవరికి పంపిణీ చేయలేక పోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం పేద, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం డబుల్ బెడ్‌రూముల ఇళ్ల నిర్మా ణాలు చేపట్టి ఇస్తామని ప్రకటించింది. ఆ మేరకు 2015-16లో జిల్లాలోని కాల్వశ్రీరాంపూర్, ఓదెల, పెద్దపల్లి పట్టణ శివారులోని రాంపెల్లి, చందపల్లి, సుల్తానాబాద్, అంతర్గాం, మంథని, కూచిరాజ్‌పల్లి, కాకర్లపల్లి, బొట్ల వనపర్తి, పుట్నూర్, గోదావరిఖనిలో దాదాపు 3200 పైగా డబుల్ బెడ్‌రూముల ఇళ్ల నిర్మాణాలను చేపట్టారు. స్థలం ఆధారంగా పట్టణ ప్రాంతాల్లో జీ ప్లస్ 3, జీ ప్లస్ 4, గ్రామాల్లో సింగిల్ ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండు పర్యాయాలు అధికారంలో ఉన్నా కూడా పూర్తి స్థాయిలో డబుల్ బెడ్ రూముల ఇళ్లను పూర్తి చేయలేకపోయింది. ఒక్క మంథనిలోని పోచమ్మవాడలో నిర్మించిన ఇళ్లను మాత్ర మే లబ్ధిదారులకు పంపిణీ చేసింది. రాంపెల్లి, చందపల్లి, కాల్వశ్రీరాంపూర్, ఓదెలలో ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన ప్పటికీ, మౌలిక వసతులైన విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పించక పోవడంతో పంపిణీకి నోచుకోలేదు. 2023 చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకానికి శ్రీకారం చుట్టింది. మొదటి విడతలో సొం తంగా ఇంటి స్థలం ఉన్న వారికే ఇళ్లు మంజూరు చేయా లని నిర్ణయించింది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రభుత్వం 3వేల ఇళ్ల చొప్పున కేటాయించగా, మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి.
ఫ డబుల్ బెడ్‌రూముల ఇళ్ల పూర్తికి కసరత్తు..
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని అమలు చేస్తుం డడంతోపాటు గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి నిరుపేదలకు పంపిణీ చేయా లని ప్రభుత్వం భావించింది. ఆ మేరకు పెద్దపల్లి మున్సిపల్ పట్టణ శివారులో నిర్మించిన ఇళ్లతో పాటు, చందపల్లి శివారులో నిర్మించిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాగా, సుమారు 8 కోట్ల రూపాయలకు పైగా డబ్బులు వెచ్చించి ఆ ఇళ్ల సముదాయాల వద్ద రోడ్ల నిర్మాణం, విద్యుత్ సౌకర్యంతోపాటు తాగునీటి సౌకర్యం కల్పించేం దుకు పనులు చేపట్టి పూర్తి చేశారు. గత ఏడాది 480 ఇళ్లను నిరుపేదలకు పంపిణీ చేశారు. అలాగే కాల్వ శ్రీరాంపూర్‌లో నిర్మాణం పూర్తయిన 244 ఇళ్లు, ఓదెలలో నిర్మించిన 144 ఇళ్లను వినియోగంలోకి తీసుక వచ్చేం దుకు మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు కాల్వశ్రీరాంపూర్‌లో తాగునీటి వసతి కోసం 74 లక్షలు, శానిటేషన్ కోసం 56 లక్షలు, విద్యుత్ సౌకర్యం కోసం 18 లక్షలు, మొత్తం కోటి 48 లక్షల రూపాయలు కేటాయించారు. ఓదెల మండల కేంద్రంలో నిర్మించిన 144 డబుల్ బెడ్ రూముల ఇళ్లను సద్వినియోగం చేసుకునేందుకు తాగునీటి సౌకర్యానికి 45 లక్షలు, విద్యుత్ సౌకర్యానికి 24 లక్షల రూపాయలు మంజూరు చేయడంతో పనులు చేపట్టారు. ఈ పనులు పూర్తి కావస్తున్నాయి. గతంలో ఈ ఇళ్ల కోసం లబ్ధిదారులను ఎంపిక చేసినప్పటికీ, వాటిని రద్దు చేసినట్లు తెలుస్తున్నది. ఎక్కడైతే ఇళ్లు నిర్మించారో ఆ గ్రామస్తులకే డబుల్ బెడ్‌రూముల ఇళ్లను కేటాయిం చాలని నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ విజయ రమణారావు భావిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూ రైనప్పటికీ కాల్వశ్రీరాంపూర్‌లో ఇళ్లు మంజూరు చేయ లేదు. ఇందుకు కారణం అక్కడ 244 డబుల్ బెడ్ రూముల ఇళ్లు అందుబాటులోకి వస్తుండడమే. పనులు పూర్తి కావస్తుండడంతో సత్వరమే లబ్ధిదారుల ఎంపిక చేసి డబుల్ బెడ్‌రూముల ఇళ్లను పంపిణీ చేయాలని పేద, నిరుపేదలు ప్రభుత్వ విప్, కలెక్టర్‌ను కోరుతున్నారు.