కాంగ్రెస్‌కు ఓటు వేసి బలి కావొద్దు
ABN , Publish Date - Feb 06 , 2026 | 12:25 AM
మున్సిపల్ ఎన్నికల్లో కాం గ్రెస్‌కు ఓటు వేసి మరోసారి బలికావొద్దని, కాంగ్రెస్ మాయమాటల కు మోసపోయి ఒకసారి ఓటు వేస్తే గోస పడుతున్నామని బీఆర్ ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు.
సిరిసిల్ల, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల్లో కాం గ్రెస్‌కు ఓటు వేసి మరోసారి బలికావొద్దని, కాంగ్రెస్ మాయమాటల కు మోసపోయి ఒకసారి ఓటు వేస్తే గోస పడుతున్నామని బీఆర్ ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. గురు వారం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేం ద్రంలోని సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. సిరిసిల్లలో జ్యోతినగర్, బీవైనగర్, సుందరయ్య నగర్, రాజీవ్ నగర్, కొత్త బస్టాండ్, నెహ్రునగర్, శాంతినగర్ చౌరస్తాల వద్ద కార్నర్ మీ టింగ్, రోడ్‌షోలు నిర్వహించారు. ఈసందర్భంగా కేటీఆర్ మాట్లాడు తూ రూ.3400 కోట్లతో సిరిసిల్ల నేతన్నలకు బతుకునిచ్చే బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇస్తే బతుకమ్మ చీర లేకుండా చేశారన్నారు. తెలంగాణ తల్లి విగ్రహంలోనే బతుకమ్మ లేకుండా చేశారనిన్నారు. నేతన్నలకు రూ 16 వేల నుంచి రూ.20వేల వరకు ఉపాధి లభించే విధంగా చేస్తే రేవం త్‌రెడ్డి నేతన్నల కడుపు మీద కొట్టి బతుకు లేకుండా చేసిన కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికల్లో బతుకు లేకుండా చేయాలన్నారు. బతుకమ్మ చీర లు లేకుండా గోస పడుతున్నామని చెప్తే కాంగ్రెస్ నాయకుడు ఒకరు నిరోద్‌లు, వడియాలు అమ్ముకోండని హేళన చేశారన్నారు. రైతుబంధు రైతన్నల ఖాతాలో వేయడానికి ముఖ్యమంత్రికి మున్సిపల్ ఎన్నికలు ఏ విధంగా అడ్డు వస్తున్నాయని అన్నారు. కేవలం ఎన్నికలు అయిపోయేం త వరకు ఆశ చూపించి, మరొకసారి మోసం చేయడానికే రేవంత్ రెడ్డి ఈ మాట చెబుతున్నారన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయ లేదని అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి అందరినీ కాంగ్రెస్ ప్ర భుత్వం మోసం చేస్తుందన్నారు. ముఖ్యమంత్రికి చేతిలో అధికారం, అవ కాశం ఉన్నప్పుడు గత ముఖ్యమంత్రి కేసీఆర్ తిట్టవలసిన అవసరం ఏముందని, చేతనైతే ప్రజలకు మంచి చేయాలి, ఇచ్చిన హామీలు అమ లు చేయాలన్నారు. ప్రతి అంశంలో అడ్డగోలుగా మాట్లాడటం, అబద్ధాలు ఆడటం తప్పించి, రెండేళ్లలో ఒక్క మంచిపని కాంగ్రెస్ ప్రభుత్వం చేయ లేదన్నారు. కేసీఆర్ ఏర్పాటుచేసిన చిన్న జిల్లాలను తీసివేయాలని కాం గ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని ఆరోపించారు. జిల్లా కేంద్రాలను రద్దు చేస్తామని చెప్పిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అది మంచి, చెడు అన్న విషయాన్ని గుర్తించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశా రు. మున్సిపల్ ఎన్నికల్లో గత 10 సంవత్సరాల పాటు ప్రజలకు అనేక సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చిన పార్టీకి, రెండు ఏళ్లలో ఉన్న సంక్షేమ పథకాలను ఎత్తివేసిన కాంగ్రెస్ పార్టీకి మధ్య పోటీ అన్నారు. మరోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తేనే తగిన అభివృద్ధి, సంక్షేమం తిరిగి ప్రారంభమవుతుందన్నారు. మున్సిపల్ ఎన్నికలతోనే కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసుకునే కార్యక్రమం ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.
సిరిసిల్ల జిల్లా లేకుండా కుట్ర..
సిరిసిల్లపై పగబట్టి తనపై కోపంతో జిల్లాను లేకుండా చేయాలన్న కాంగ్రెస్ కుట్రలకు బుద్ధి చెప్పాలని, సిరిసిల్ల జిల్లాను కాపాడుకునేలా బదలా తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీని మున్సిపల్ ఎన్నికల్లో నిలదీ యకుంటే, ఇచ్చిన హామీల మోసంపైన ప్రశ్నించకుంటే, మరో మూడు సంవత్సరాలు శాసనసభ ఎన్నికల వరకు ప్రజలకు ప్రభుత్వాన్ని, కాం గ్రెస్ పార్టీని ప్రశ్నించే అధికారం, అవకాశం రాదన్నారు. బీజేపీ దేవుడి పేరు చెప్పి గుడి ముందు అడుక్కునే వాళ్లలాగా ఓట్ల కోసం వస్తారన్నా రు. ఎన్నికల రాగానే కులం, మతం గుర్తుకు వస్తుందనిన్నారు. హిందూ, ముస్లింలు అన్నదమ్ములలాగా కలిసి ఉన్నామని పని చేసే వాళ్లకి ఓట్లు వేయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగ య్య, టెస్కాబ్ మాజీ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు, బీఆర్‌ఎస్ ఇన్ చార్జి తుల ఉమ, పట్టణఅధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ మాజీ చైర్మన్ మంచె శ్రీనివాస్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు చీటి నర్సింగ రావు, బొల్లి రామ్మోహన్, బీఆర్‌ఎస్ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.