Share News

సైబర్‌ నేరస్థుల వలలో చిక్కి మోసపోవద్దు

ABN , Publish Date - Apr 08 , 2026 | 12:20 AM

సైబర్‌ నేరస్థుల వలలో చిక్కుకుని వారి మాయమాటలను నమ్మి మోసపోవద్దని సిరిసిల్ల టౌన్‌ సీఐ శ్రీనివాస్‌ కోరారు.

సైబర్‌ నేరస్థుల వలలో చిక్కి మోసపోవద్దు

సిరిసిల్ల అర్బన్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి) : సైబర్‌ నేరస్థుల వలలో చిక్కుకుని వారి మాయమాటలను నమ్మి మోసపోవద్దని సిరిసిల్ల టౌన్‌ సీఐ శ్రీనివాస్‌ కోరారు. పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మీ కోసం కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాత్రి సిరిసిల్ల అర్బన్‌ పరిధిలోని పెద్దూర్‌ డబుల్‌ బెడ్‌రూం కాలనీవాసులతో సమావేశాన్ని నిర్వహించారు. గంజాయి, రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్‌ నియమాలు, గల్ఫ్‌ ఏజెంట్‌ల మోసాలు, సైబర్‌ మోసాలు, బెట్టింగ్‌ యాప్స్‌, మహిళా చట్టాలు, షీ టీమ్‌, నూతన చట్టాలతో పాటు సీసీ కెమె రాల ఆవశ్యకతల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో సైబర్‌ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. సైబర్‌ నేర గాళ్ల మాయమాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. ఎవరైనా మోసపోయినట్లయితే 1930కి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయ డం జరుగుతుందని, తద్వారా ఏ సంఘటన జరిగిన వెంటనే తెలుస్తుందన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించాలని కోరారు. లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడువద్దన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2026 | 12:20 AM