Share News

రైతులను ఇబ్బందులకు గురిచెయ్యొద్దు

ABN , Publish Date - May 21 , 2026 | 12:45 AM

రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని చర్యలు తప్పవని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మె ల్యే ఆది శ్రీనివాస్‌ హెచ్చరించారు.

రైతులను ఇబ్బందులకు గురిచెయ్యొద్దు

వేములవాడ రూరల్‌, మే 20 (ఆంధ్రజ్యోతి) : రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని చర్యలు తప్పవని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మె ల్యే ఆది శ్రీనివాస్‌ హెచ్చరించారు. వేములవాడ పరి ధిలోని పలు రైస్‌ మిల్లులను బుధవారం ఆయన ఆక స్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మర్రిపల్లిలో ని రైసుమిల్లుల్లోకి దాన్యంతో వచ్చిన రైతులను వివరా లు అడిగి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఎమ్మె ల్యే ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ రైతులెవ్వరు అధైర్య పడవద్దని, రైతు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొంటామని భరోసానిచ్చారు. ధాన్యం కొనుగో లులో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవస రం లేదన్నారు. రైతులు పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తామన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బం దులు తలెత్తకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసు కుంటుందన్నారు. జిల్లా కేంద్రంలో ఆపరాల్‌ పార్కు గోదాంలో ధాన్యం దిగుమతికి ఏర్పాటు చేస్తున్నామ న్నారు. రైస్‌మిల్లులో అన్‌లోడింగ్‌ ప్రక్రియ వేగంవం తంగా పూర్తి చేసుకోవాలని, రైతులకు సౌకర్యాలు కల్పించాలన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందు న రైతులకు సరిపడా తాగునీటిని ఏర్పాటు చేయాల న్నారు. హమాలీల సంఖ్యను పెంచుకోవాలన్నారు. ధాన్యం తీసుకువచ్చిన వాహనాలకు టోకెన్లను ఇవ్వా లని తహసీల్దార్‌కు సూచించారు. రైసుమిల్లులకు దగ్గ రగా ఉన్న గ్రామాల్లో ఉన్న ట్రాక్టర్లను దాన్యం తీసుకు వచ్చేందుకు వాడుకుంటున్నామన్నారు. రైతుల పక్షాన ధాన్యం కొనుగోలు ప్రక్రియ, దిగుమతి ప్రక్రియను క్షేత్రస్తాయిలో పరిశీలించామన్నారు. మిల్లర్లు తప్పని సరిగా నిబంధనలు పాటించాలన్నారు. మార్కెట్‌ కమి టీ చైర్మన్‌ రొండి రాజు, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్య క్షుడు సోయినేని కరుణాకర్‌, వట్టెంల సర్పంచ్‌ రంగు వెంకటేశంగౌడ్‌, పలువురు నా యకులు పాల్గొన్నారు.

కోనరావుపేట, : కోనరావుపే ట మండలం కొలనూరులో రైస్‌ మిల్లులను ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ, మిల్లింగ్‌ సక్రమంగా జరుగు తుందో లేదో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం మా ట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, మిల్లర్లు నిబంధనలు పాటించాలని సూచించారు. రైస్‌ మిల్లర్లు ధాన్యం త్వరగా దిగుమతి చేసుకోవాలని అన్నారు. రైతులను ఇబ్బందులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట ఎస్‌ఎంసి చైర్మన్‌ కచ్చకాయల ఎల్లయ్య, కేతిరెడ్డి జగన్మోహన్‌ రెడ్డి, వైస్‌ ఎంపీపీ తాళ్లపల్లి ప్రభాకర్‌, ఫిరోజ్‌ పాషా, బండ నర్సయ్య, మానక సత్యం, భాస్కరరావు, తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - May 21 , 2026 | 12:45 AM