దళారులను నమ్మి మోసపోవద్దు
ABN , Publish Date - Apr 21 , 2026 | 11:48 PM
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి రైతన్నలు మోసపోవద్దని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
వేములవాడ, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి రైతన్నలు మోసపోవద్దని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లి సింగిల్వీండో ఆధ్వర్యంలో అర్భన్ మండలం అనుపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు పెద్ద పీట వేస్తున్నారని, రైతులు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి సింగిల్వీండో సీఈవో, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.