పోరాటస్ఫూర్తికి ప్రతీక దొడ్డి కొమురయ్య
ABN , Publish Date - Apr 04 , 2026 | 12:42 AM
పోరాటస్పూర్తికి ప్రతీక దొడ్డి కొమురయ్య అని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అన్నారు.
సిరిసిల్ల అర్బన్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి) : పోరాటస్పూర్తికి ప్రతీక దొడ్డి కొమురయ్య అని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అన్నారు. కలెక్టరేట్‌లో శుక్ర వారం దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దొడ్డి కొమురయ్య చిత్రపటానికి అదనపు కలెక్టర్ పూలమాలలు వేసి నివా ళులు అర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ దొడ్డి కొమురయ్య పోరాటస్ఫూర్తిని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షే మ శాఖ జిల్లా అధికారి సౌజన్య, ఉద్యానవన శాఖ అధికారి శరత్, ఎగుట్ల కనుకయ్య, నాగం కుమార్, చిమల్ల మల్లేశం, స్తంబ లచ్చయ్య, వేముల నాగరాజు, అధికారులు ,సిబ్బంది పాల్గొన్నారు.