వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలి
ABN , Publish Date - Jun 12 , 2026 | 12:22 AM
ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది ప్రతిరోజు అందుబాటులో ఉండాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు.
సిరిసిల్ల టౌన్, జూన్ 11 (ఆంధ్రజ్యోతి) : ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది ప్రతిరోజు అందుబాటులో ఉండాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రం సుందరయ్యనగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ గరిమ అగ్రవాల్ తనిఖీ నిర్వహించారు. ఆసుప త్రిలోని రిజిస్టర్, ఏఎన్‌సీ నమోదును, వ్యాక్సిన్ గదితోపాటు మందులను పరిశీలించారు. ఎన్‌సీడీ స్ర్కీనింగ్ టెస్టులపై వైద్యురాలు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని ప్రభుత్వ వైద్యశాలలోనే ప్రసవాలు జరిగేలా, ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రజ లు చికిత్స పొందేలా సిబ్బంది అవగాహన కల్పించాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా ప్రజలకు మెరుగైన వైద్యం అందించా లని కలెక్టర్ ఆదేశించారు. ఎన్‌సీడీ స్ర్కీనింగ్ టెస్టులు, సీజనల్ వ్యాధులు, పరిసరాల పరిశుభ్రతపై వైద్యులు, సిబ్బందికి వివరించారు. కలెక్టర్ వెంట అర్బన్ ప్రాథమిక వైద్యురాలు, సిబ్బంది ఉన్నారు.