Share News

మోసపూరిత వాగ్దానాలను నమ్మొద్దు

ABN , Publish Date - Nov 04 , 2026 | 12:43 AM

పాలకుల మోస పూరిత వాగ్దానాలను ప్రజలు నమ్మవద్దని సీపీఐ(ఎంల్‌) రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్‌ అన్నారు.

మోసపూరిత వాగ్దానాలను నమ్మొద్దు

సిరిసిల్ల టౌన్‌, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి) : పాలకుల మోస పూరిత వాగ్దానాలను ప్రజలు నమ్మవద్దని సీపీఐ(ఎంల్‌) రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్‌ అన్నారు. మంగళవారం సీపీఐ(ఎంల్‌) ఆధ్వ ర్యంలో చండ్ర పుల్లారెడ్డి వర్ధంతిని నిర్వహించారు. జిల్లా కేంద్రం శాంతినగర్‌లోని ఏఐఎఫ్‌టీయూ(న్యూ) జిల్లా కార్యాలయం ఎదు ట పార్టీ జెండాను ప్రసాద్‌ ఆవిష్కరించారు. అనంతరం పట్టణ ప్రధాన రహదారుల గుండా ఎర్రజెండాలతో ర్యాలీ నిర్వహించా రు. శాంతినగర్‌లోని ఆదర్శ పద్మశాలి సంఘం భవనంలో ఏఐ ఎఫ్‌టీయూ నాయకుడు సోమిశెట్టి దశరథం అధ్యక్షతన చండ్ర పుల్లారెడ్డి వర్ధంతి సభ జరిగింది. ఈ సందర్భంగా ప్రసాద్‌ మా ట్లాడుతూ దేశంలో జరిగిన విప్లవోద్యమంలో అసువులు బాసిన అమరవీరులను స్మరించుకోవాలన్నారు. కేంద్రంలో, రాష్ట్రాల్లో పాలక పార్టీలు దళారీ పెట్టుబడిదారులకు బహుళ జాతి కంపె నీలకు ఊడిగం చేస్తూ కాలం వెళ్లదీస్తున్నాయని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో నాయకులు వొల్లాల కిషోర్‌, బామండ్ల రవీం దర్‌, మచ్చ అనసూయ, సంగీత, త్రివేణి, వసంత, అంజనేయు లు, శ్యాం, కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - Nov 04 , 2026 | 12:43 AM