గర్భిణుల ఆరోగ్య సంరక్షణపై నిర్లక్ష్యం చేయొద్దు
ABN , Publish Date - Jun 26 , 2026 | 12:01 AM
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గర్భిణులకు ఆరోగ్య సంరక్షణలో నిర్లక్ష్యం చేయవద్దని వారికి నాణ్యమైన ప్రసూతి పూర్వ వైద్యసేవలు అందించాల్సిన బాధ్యత ఆరోగ్య సిబ్బందిపై ఉందని జిల్లా వైద్యాధికార డాక్టర్ ఎంజేలా ఆల్ర్ఫెడ్ కోరారు.
సిరిసిల్ల అర్బన్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి) : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గర్భిణులకు ఆరోగ్య సంరక్షణలో నిర్లక్ష్యం చేయవద్దని వారికి నాణ్యమైన ప్రసూతి పూర్వ వైద్యసేవలు అందించాల్సిన బాధ్యత ఆరోగ్య సిబ్బందిపై ఉందని జిల్లా వైద్యాధికార డాక్టర్ ఎంజేలా ఆల్ర్ఫెడ్ కోరారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్‌నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురు వారం ఆమె తనిఖీ చేశారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణు లకు వైద్య పరీక్షల క్లీనిక్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా గర్భిణులకు అందిస్తున్న వైద్య సేవలు, రక్తపోటు హిమోగ్లోబిన్, బరువు, గర్భస్థ శిశువు ఎదుగుదల తదితర పరీక్షల నిర్వహణపై సమీక్షించారు. అదే విధంగా యాంటీనాటల్ రిజిస్ట్రర్‌లు, గర్భిణుల నమోదు వివరాలు హైరిస్క్, గర్భి ణుల పర్యవేక్షణ రికార్డులు, మందుల పంపిణీ వివరాలు తదితర రికార్డు లను పరిశీలించారు. రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నమోదు చేసి సేవలందించాలని, ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని సిబ్బంది ని ఆదేశించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎంజేలా ఆల్ర్ఫెడ్ మాట్లాడుతూ గర్భిణుల ఆరోగ్య సంరక్షణలో నిర్లక్ష్యానికి తావులేకుండా నాణ్యమైన ప్రసూ తి పూర్వ వైద్య సేవలందించాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపై ఉందన్నారు. గర్భిణులకు ఐరన్, కాల్షియం మాత్రలు, టీకాలు, పోషకాహారం, ప్రసూతి అనంతర సంరక్షణపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడిక ల్ ఆఫీసర్ డాక్టర్ రేఖ, ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.