ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచొద్దు
ABN , Publish Date - Mar 02 , 2026 | 11:55 PM
ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ చిత్ర మిశ్రా అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
సుభాష్‌నగర్, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ చిత్ర మిశ్రా అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు వారి స్థాయిలో ప్రతి దరఖాస్తును పరిష్కరించాలని సూచించారు. శాఖల వారీగా దరఖాస్తులు స్వీకరణ, పరిష్కారం, పెండింగ్ వంటి అంశాలపై సమీక్షస్తానని తెలిపారు. ప్రజావాణిలో 345 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాఖడే, లక్ష్మికిరణ్, మన్సిపల్ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్, ఆర్డీవో మహేశ్వర్ పాల్గొన్నారు.