ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచవద్దు
ABN , Publish Date - Jul 20 , 2026 | 11:36 PM
సుభాష్‌నగర్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు.
సుభాష్‌నగర్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 30 రోజులకుపైగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. కోర్టు కేసులు, సీఎం ఆఫీసు, ట్విట్టర్‌లో వచ్చిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలిన చేసి పరిష్కరించాలని ఆదేశించారు. పరిష్కరించిన దరఖాస్తుల వివరాలను లాగిన్‌లో అప్‌డేట్ చేయాలని సూచించారు. 313 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాఖడే, శ్రీనివాస్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.