కొనుగోళ్లు, ధాన్యం దిగుమతిలో జాప్యం చేయొద్దు
ABN , Publish Date - Apr 26 , 2026 | 12:36 AM
ధాన్యం కొనుగోళ్లు, మిల్లుల్లో దిగుమతిలో జాప్యం చేస్తే చర్యలు తప్పవ ని అదనపు కలెక్టర్ నగేశ్ హెచ్చరించా రు.
ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోళ్లు, మిల్లుల్లో దిగుమతిలో జాప్యం చేస్తే చర్యలు తప్పవ ని అదనపు కలెక్టర్ నగేశ్ హెచ్చరించా రు. ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి, రాగట్లపల్లి గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన శనివారం పరిశీలించడంతో పాటు రైస్‌మిల్లు లను తనిఖీ చేశారు. కేంద్రాలకు చేరుకున్న ధాన్యం నిల్వలు, కొనుగోలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వేగవంతం చేయాలని ఆదేశించారు. కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని అన్నారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. గొల్లపల్లిలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం తరలింపునకు రెండు రైస్ మిల్లులను కేటాయించాలని సర్పంచ్ రమేశ్ కోరారు. ధాన్యం దిగుమతిలో కోత లు లేకుండా చూడాలని విన్నవించారు. స్పందించిన అదనపు కలెక్టర్ అన్నదాతలకు ఇబ్బందులు కల్గకుండా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. అనం తరం రైస్ మిల్లులను తనిఖీ చేశారు. ధాన్యం లోడ్ తో వచ్చే వాహనాలను ఆలస్యం చేయకుండా వెనువెంటనే అన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఇబ్బందులకు గురిచేయకూడదని అన్నారు. రైస్‌మి ల్లర్లు సహకరించాలని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నా రు. ఆయన వెంట తహసీల్దార్ సుజాత, ఆర్‌ఐ శ్రవ ణ్, తదితరులు ఉన్నారు.