Share News

అంబరాన్నంటిన దీపావళి సంబురాలు

ABN , Publish Date - Nov 10 , 2026 | 12:21 AM

వెలుగుల పండుగ దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి.

అంబరాన్నంటిన దీపావళి సంబురాలు

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

వెలుగుల పండుగ దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. ఇంటింటా వెలుగుల సందడి నింపింది. దివ్వెల వెలుగుల్లో టపాసుల చప్పుళ్ల మధ్య దీపావళి సంబరాలను రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. జిల్లా వ్యాప్తంగా దేదీప్యమానంగా ఘనంగా వాడవాడ లా దివ్వెల వేడుకలు జరిగాయి. ఆదివారం రాత్రి వ్యాపార సముదాయాల్లో, ఇండ్లలో లక్ష్మిపూజల ను ఘనంగా నిర్వహించుకున్నారు. సిరిసిల్ల మా నేరు తీరంలో ఏర్పాటు చేసిన టపాసుల దుకాణాలను వ్యాపారులు ఏర్పాటు చేయగా కొనుగోళ్ల తో సందడి కనిపించింది. ఎక్కడ చూసినా వెలుగులు వెదజల్లే టపాసులు, ధ్వనులు, మెరుపుల తో ఆకట్టుకునే పేలుడు సామగ్రి దీపావళికి ప్రత్యేక శోభనిచ్చింది. దీపకాంతులతో సిరిసిల్ల కేంద్రంలో వెలుగు జిలుగులతో కనిపించింది. వ్యాపారులు తమ దుకాణాలను విద్యుత్‌ లైట్లతో అలంకరించుకుని లక్ష్మిదేవి పూజలను వైభవంగా జరుపుకున్నారు. సిరిసిల్ల ప్రధాన వ్యాపార కూడళ్లయిన గాంధీచౌక్‌, పాతబస్టాండ్‌, కొత్తబస్టాండ్‌, మార్కెట్‌ ఏరియా, వెంకంపేట,ప్రాంతాల్లో ప్రత్యే క శోభ కనిపించింది. శ్రీలక్ష్మివెంకటేశ్వరస్వామి దేవాలయంతో పాటు హరిహరపుత్ర అయ్యప్ప దేవాలయం, సాయిబాబా, శివాలయం, హనుమాన్‌ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం మహిళలు కేదారీనాథ్‌ వ్రతా లు, నోములు జరుపుకున్నారు

జోరుగా టపాసుల విక్రయాలు

దీపావళి సందర్భంగా సోమవారం సిరిసిల్ల మార్కెట్‌ జనంతో కిటకిటలాడింది. మానేరు తీరంలో టపాసుల అమ్మకాలు జోరుగా సాగా యి. టపాసులు కిలో చొప్పున తూకం వేసి అమ్మారు. ఈసారి మార్కెట్‌లో బంతి పూలు ముంచెత్తాయి. గత సంవత్సరం రూ 100 కిలో ధర పలుకగా ఈసారి రూ.40 నుంచి 50కి విక్ర యాలు జరిగాయి. పండుగ సందర్భంగా వచ్చే బచ్చీసలు, చెక్కెర పల్లీలు, కడ్డీలు అమ్మకాలు సాగాయి. స్వీట్ల కొనుగోలు కూడా ఎక్కువగానే కొనసాగాయి. మార్కెట్‌ సం దడి మధ్య దీపావళిని ఘనం గా జరుపుకున్నారు.

ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి : దీపావళి వేడుకలు ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో ఆదివారం ఘనంగా జరిగా యి. మండల కేంద్రాలతో పాటు గొల్లపల్లి, నారాయణపూర్‌, పదిర, సింగారం, బొప్పాపూర్‌, బండలింగంపల్లి, అల్మాస్‌పూర్‌, తిమ్మాపూర్‌, గుండారం, వెంకటాపూర్‌, కోరుట్లపేట, కంచర్ల, అడవిపదిర, రంగంపేట, మద్దిమల్ల, గర్జనపల్లి, వన్‌పల్లి, తదితర గ్రామాల్లోని ఆలయాల్లో ఉద యం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వ్యాపార, వాణిజ్య దుకాణాలు, ఇళ్లను అందంగా అలంకరించారు. దీపాలను వెలగించి లక్ష్మీ పూజలు చేశారు. చిన్నారులు, పెద్దలు టపాసులు కాల్చారు. పలు గ్రామంలో పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులను అందజేశారు. తహసీల్దార్లు దివ్యజ్యోతి, నారాయణరెడ్డి, ఎంపీడీవోలు సత్తయ్య, శ్రీలేఖ, సీఐ వెంక టేశ్‌, ఎస్‌ఐలు రమేశ్‌, లక్ష్మణ్‌, ఏఎంసీ చైర్మన్లు దేవానందం, మమతలు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

ఇల్లంతకుంట :మండలంలో భక్తిశ్రద్ధల మధ్య దీపావళి వేడుకలు జరిగాయి. మండల కేంద్రం తో పాటు పలు గ్రామాల్లో ఆదివారం ధనలక్ష్మి పూజలు నిర్వహించగా, ఇళ్ళలో కేదారేశ్వరి వ్రతా లు చేశారు. వ్యాపార సంస్థలు, ఇళ్ల ముందు యువకులు, మహిళలు టాపాసులు కాల్చారు. మండల కేంద్రంలో టపాసుల విక్రయ కేంద్రాల ను దూరంగా ఏర్పాటు చేయడంపై కొనుగోలుదా రులు కొంత ఇబ్బంది పడ్డారు.

గంభీరావుపేట : మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో దీపావళి సంబరాలు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. దీపావళి పర్వదినం సందర్భంగా ప్రజలు టపాసులు, బాణసంచా కాల్చుతూ చిన్నలు, పెద్దలు సంబరాల్లో మునిగి తేలారు. ప్రజలు, పలు వ్యాపారులు, లక్ష్మిదేవికి ప్రత్యేక పూజలు చేశారు. అన్ని వ్యాపార సంస్థ లు లక్ష్మిపూజలు చేశారు.

చందుర్తి : దీపావళి పండుగను మండల వ్యాప్తంగా ప్రజలు ఆదివారం ఘనంగా జరుపు కున్నారు. మహిళలు లక్ష్మీదేవి పూజలు నిర్వహిం చారు. సాయంత్రం వేళలో ఇళ్లలో సత్యనారాయ ణస్వామి, కేదారేశ్వరస్వామి నోములను నోముకు న్నారు. దుకాణాల్లో లక్ష్మీపూజలు నిర్వహించారు.

Updated Date - Nov 10 , 2026 | 12:21 AM