జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభం
ABN , Publish Date - Jun 13 , 2026 | 11:56 PM
కరీంనగర్ జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు జిల్లా కేంద్రంలోని బ్యాడ్మింటన్ అకాడమీలో శనివారం ఉదయం ఘనంగా ప్రారంభమ య్యాయి.
కరీంనగర్ స్పోర్ట్స్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు జిల్లా కేంద్రంలోని బ్యాడ్మింటన్ అకాడమీలో శనివారం ఉదయం ఘనంగా ప్రారంభమ య్యాయి. జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో రెండు రోజులపాటు నిర్వహించనున్న ఈ పోటీలను తెలంగాణ రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు వై ఉపేందర్‌రావు క్రీడాకారులను పరిచయం చేసుకొని ప్రారంభించారు. జిల్లాలో బ్యాడ్మింటన్ క్రీడలపై ఆసక్తి పెరిగిందని అందుకు ఇంత పెద్ద స్థాయిలో క్రీడాకారులు హాజరు కావడమే నిదర్శనమన్నారు. నేటి పరిస్థితుల్లో విద్యార్థులకు, యువతకు చదువుతోపాటు క్రీడలు కూడా ఎంతో అవసరమన్నారు. పోటీల్లో ప్రతిభచాటి ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించే క్రీడాకారు లను తెలంగాణ రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక చేయనున్నామన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన అఖిల భారత జూనియర్ ర్యాంకింగ్ అండర్-17 బ్యాడ్మింటన్ పోటీల్లో విజేతగా నిలిచిన జిల్లాకు చెందిన తన్మై నిహాల్ ఉత్తమ్‌కు అసోసియేషన్ పక్షాన అండగా ఉంటామన్నారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి ఈ పోటీలకు జూనియర్స్ విభాగంలో 100 మంది బాలబాలికలు, సీనియర్స్ విభాగంలో 80 మంది మహిళలు, పురుషులు హాజర య్యారు. వీరికి సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో పోటీలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంఘ సంయుక్త కార్యదర్శి సిరి రవి, నిర్వహణ కమిటీ చైర్మన్ జి ఆనంద్ కుమార్, సీనియర్ క్రీడాకారులు సీహె్ రాజన్‌బాబు, అవినాష్, గంగరాజు, కౌశిక్ రావు, సఫాఉల్లాఖాన్, ప్రేమ్ కుమార్, లక్ష్మణ్, అనిల్, లావణ్య, టెక్నికల్ అఫీషియల్స్, తదితరులు పాల్గొన్నారు.