Share News

నేడు ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సభ

ABN , Publish Date - May 22 , 2026 | 12:25 AM

ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా కేంద్రంలో శుక్రవారం జిల్లాస్థాయి సభ నిర్వహించనున్న ట్లు కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ వెల్లడించారు.

నేడు ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సభ

సిరిసిల్ల, మే 21 (ఆంధ్రజ్యోతి): ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా కేంద్రంలో శుక్రవారం జిల్లాస్థాయి సభ నిర్వహించనున్న ట్లు కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ వెల్లడించారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదా యంలో కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌, అధికారు లతో కలిసి సభ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకాలపై విస్తృత అవగాహన కల్పించడం, పాలనలో ప్రజల భాగస్వామ్యా న్ని పెంపొందించడం, స్థానిక సమస్యలు, అభివృద్ధి ప్రాధాన్యతలను గుర్తించడంతో పాటు రాబోయే రోజుల్లో చేపట్టబోయే ప్రభుత్వ పథకాల గురించి తెలియజేయ డం, తదితర అంశాలపై ఈ సభ నిర్వహిస్తున్నామన్నా రు. మార్చి 6వ తేదీ నుంచి జూన్‌ 12వ తేదీ వరకు ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణ యించిందని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే గ్రామ, మండ ల, నియోజకవర్గ స్థాయిలో సభలు నిర్వహించ డంతో పాటు ప్రతీ వారం వివిధ శాఖల ఆధ్వర్యంలో కార్యక్ర మాలు చేపడుతున్నామని తెలిపారు. జిల్లా స్థాయి సభ సిరిసిల్ల పట్టణ రగుడు సమీపంలోని సాయి మణికంఠ ఫంక్షన్‌ హాల్లో శుక్రవారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నామని వెల్లడించారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికా రులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. అలాగే యువజన, క్రీడా వారోత్సవాల సందర్భంగా 22వ తేదీ సాయంత్రం 6 గంటలకు సిరిసిల్ల పట్టణం కొత్త చెరువు వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వ హించడం జరుగుతుందని తెలిపారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిం చడానికి జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు తరలిరా వాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిరిసిల్ల ఆర్డీవో రాజేందర్‌రెడ్డి, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, సీపీవో శ్రీనివాసాచారి, డీఈవో జగన్‌మోహన్‌రెడ్డి, డీపీఆర్‌వో ఏడుకొండలు, మున్సిపల్‌ కమిషనర్‌ ఖదీర్‌ పాషా, మెప్మా ఏవో మీర్జా ఫసహత్‌ అలీ బేగ్‌ తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - May 22 , 2026 | 12:25 AM