ముగిసిన జిల్లాస్థాయి సీఎం కప్ పోటీలు
ABN , Publish Date - Feb 15 , 2026 | 12:25 AM
రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీల్లో భాగంగా రెండు రోజులుగా జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడి యంలో, ప్రాంతీయ క్రీడా పాఠశాలలో జిల్లా క్రీడాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి మహిళలు, పురుషుల సీఎం కప్ పోటీలు శనివారం ముగిశాయి
కరీంనగర్ స్పోర్ట్స్, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీల్లో భాగంగా రెండు రోజులుగా జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడి యంలో, ప్రాంతీయ క్రీడా పాఠశాలలో జిల్లా క్రీడాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి మహిళలు, పురుషుల సీఎం కప్ పోటీలు శనివారం ముగిశాయి. ఈ పోటీల్లో కరీంనగర్ జిల్లాలోని మానకొండూర్, హుజూరాబాద్, చొప్పదండి, కరీంన గర్ నియోజకవర్గాలతో పాటు హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి క్రీడాకారులు హాజరై ప్రతిభచాటారు. రెండవ రోజు మహిళలకు నిర్వహించిన ఖో-ఖో, కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్ క్రీడాంశాలు ఉత్సాహంగా సాగాయి. అలాగే మహిళలు, పురుషులకు సెపక్ తక్రా, హ్యాండ్‌బాల్, ఆత్యపత్య, చెస్, రెజ్లింగ్, బాల్ బ్యాడ్మిం టన్, షటిల్ బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన జట్లకు ట్రోఫీలతోపాటు పతకాలను ప్రదానం చేశారు. అలాగే ప్రతిభచాటిన క్రీడాకారులను ఈ నెల 19 నుంచి 23 వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించే రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలకు ఎంపిక చేశారు. గెలుపొందిన జట్లకు బహుమతి ప్రదానం చేశారు. డీవైఎస్‌వో వి శ్రీనివాస్‌గౌడ్, జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శి బి వేణుగోపాల్, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు బాబు శ్రీనివాస్ గౌడ్, ఆడెపు శ్రీనివాస్, అంతటి శంకరయ్య, చిరుత శ్రీనివాస్, వివిధ క్రీడా సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.