ఉత్సాహంగా జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు
ABN , Publish Date - Jun 01 , 2026 | 12:20 AM
కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలను ఆదివారం నిర్వహించారు. మహిళలు, పురుషులు, బాలబాలికల విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 60 మంది క్రీడాకారులు హాజరయ్యారు.
కరీంనగర్ స్పోర్ట్స్, మే 31 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలను ఆదివారం నిర్వహించారు. మహిళలు, పురుషులు, బాలబాలికల విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 60 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈ పోటీలను జిల్లా సంఘ సభ్యులు, రిటైర్డ్ సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు బెజ్జంకి రాజగోపాలాచారి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభచాటి జిల్లా క్రీడా పతాకాన్ని ఎగురవేయాలన్నారు. అనతరం రన్స్, త్రోస్, జంప్స్, వాకింగ్ అంశాల్లో పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభచాటిన క్రీడాకారులను ఈ నెల 11న హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 10న పుట్టిన తేదీధ్రురవపత్రంతోపాటు ఆధార్ కార్డు, రెండు ఫోటోలతో జిల్లా సంఘ ప్రధాన కార్యదర్శి జనగాం సుమన్ కళ్యాణ్‌కు రిపోర్టు చేయాలని అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నందెల్లి మహిపాల్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎం చంద్రశేఖర్, కోశాధికారి హరికిషన్, సభ్యులు ఎస్ రమేష్, సమ్మయ్య పాల్గొన్నారు.