హెచ్‌ఐవీ 95లక్ష్య సాధనలో జిల్లాకు గుర్తింపు
ABN , Publish Date - Nov 18 , 2026 | 12:09 AM
హెచ్‌ఐవీ 95 లక్ష్యాల సాధనలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు గుర్తింపు వచ్చిందని, సమ్మాన్ సమా రోహ్‌లో సురక్షిత్ జిల్లాగా ఎంపికైందని నాకో ప్రాజెక్ట్ రాష్ట్ర అదనపు డైరెక్టర్ డాక్టర్ రాజేశం అన్నారు.
సిరిసిల్ల అర్బన్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) : హెచ్‌ఐవీ 95 లక్ష్యాల సాధనలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు గుర్తింపు వచ్చిందని, సమ్మాన్ సమా రోహ్‌లో సురక్షిత్ జిల్లాగా ఎంపికైందని నాకో ప్రాజెక్ట్ రాష్ట్ర అదనపు డైరెక్టర్ డాక్టర్ రాజేశం అన్నారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం నాకో ప్రాజెక్టు రాష్ట్ర అదనపు డైరెక్టర్ డాక్టర్ రాజేశం పర్యటించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమ సిబ్బంది తో కలిసి కలెక్టర్ గరిమ అగ్రవాల్‌ను మార్యాదపూర్వకంగా కలిసి సన్మా నించారు. హెచ్‌ఐవీ 95 లక్ష్యాల సాధనలో జిల్లాకు వచ్చిన గుర్తింపు పత్రా న్ని అందజేశారు. అనంతరం కలెక్టర్‌తో కలిసి ఏర్పాటుచేసిన సమావే శంలో నాకో ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మాన్ సమారోహ్ కార్యక్రమంలో హెచ్‌ఐవీ నియంత్రణకు సంబంధించి జిల్లాలు సాధిస్తున్న ప్రగతి ఆధా రంగా సురక్షిత్, సక్షమ్, సంఘర్షశీల్ కేటగిరిలుగా వర్గీకరిస్తున్నారని తెలి పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20 జిల్లాలు సురక్షిత్, 12 జిల్లాలు సక్షమ్, ఒక జిల్లా సంఘర్ష్‌శీల్ స్థాయిలో ఉండగా, సురక్షిత్‌హోదా సాధించిన 20 జిల్లా ల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా కూడా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ఏజెంల్ అల్ర్ఫెడ్, ప్రోగ్రామ్ అఫీసర్ డాక్టర్ రాంరెడ్డి, జిల్లా ప్రోగామ్ మేనేజర్ సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.