Share News

ఉత్సాహంగా జిల్లా అథ్లెటిక్స్‌ ఎంపిక పోటీలు

ABN , Publish Date - Jul 06 , 2026 | 12:23 AM

జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ ఎంపిక పోటీలకు విశేష స్పందన లభించింది. జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ క్రీడా పాఠశాలల్లో నిర్వహించిన సీనియర్స్‌, మహిళలు, పురుషుల పోటీలకు 80 మంది క్రీడాకారులు హాజరయ్యారు.

ఉత్సాహంగా జిల్లా అథ్లెటిక్స్‌ ఎంపిక పోటీలు
అథ్లెటిక్స్‌లో పాల్గొంటున్న క్రీడాకారులు

కరీంనగర్‌ స్పోర్ట్స్‌, జూలై 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ ఎంపిక పోటీలకు విశేష స్పందన లభించింది. జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ క్రీడా పాఠశాలల్లో నిర్వహించిన సీనియర్స్‌, మహిళలు, పురుషుల పోటీలకు 80 మంది క్రీడాకారులు హాజరయ్యారు. వేర్వేరుగా వీరికి పోటీలను నిర్వహించి, పోటీల్లో విశేష ప్రతిభచాటిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. కార్యక్రమంలో అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు నందెల్లి మహిపాల్‌, ప్రధాన కార్యదర్శి సుమన్‌ కళ్యాణ్‌, బి రాజగోపాలాచారి, కిరణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 06 , 2026 | 12:23 AM