Share News

ప్రజలందరికి స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ

ABN , Publish Date - Aug 08 , 2026 | 12:08 AM

ప్రజలందరికి ఈనెల 15న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్మార్ట్‌ రేషన్‌కార్డులను పంపిణీ చేస్తార ని మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, జూపల్లి కృష్ణారావులు తెలిపారు.

ప్రజలందరికి స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ

సిరిసిల్ల అర్బన్‌, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి) : ప్రజలందరికి ఈనెల 15న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్మార్ట్‌ రేషన్‌కార్డులను పంపిణీ చేస్తార ని మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, జూపల్లి కృష్ణారావులు తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం సాయంత్రం జరిగిన వీడియోకాన్ఫరేన్స్‌లో హైదరాబాద్‌ సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజుతో కలిసి మంత్రులు వీడియో కాన్ఫరె న్స్‌ నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌తో జిల్లాలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, వనమహోత్సవం, స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ వ్యవసాయం, తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెల15న కోటి 6లక్షల స్మార్ట్‌ రేషన్‌ కార్డులు పంపిణీ చేస్తారని తెలి పారు. ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని అవసరాలకు అనుగుణంగా వినియోగిం చుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రధానంగా తాగునీటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. వన మహోత్సవం లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. పంట మార్పిడి విధానాల వల్ల రైతు లు నష్టపోకుండా ఉంటారన్నారు. ఆర్డీవోలు శ్రీధర్‌బాబు, కేఎస్‌బీ కు మారి, డీఆర్‌డీవో లక్ష్మీనారాయణ, సీపీవో శ్రీనివాసాచారి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ నిఖిత తదితరులు పాల్గొన్నారు.

నాణ్యమైన సమాచారాన్ని సేకరించాలి

నాణ్యతతో జనగణన హ్యాండ్‌ బుక్‌తో పాటు ఫీల్డ్‌ ఫంక్షనరీలు క్షేత్ర స్థాయిలో పక్కాగా సేకరించేలా చూడాలని రాష్ట్ర జనాభా లెక్కల సం చాలకులు భారతీ హోళికేరి ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జరి గిన వీడియోకాన్ఫరెన్స్‌లో హైదరాబాద్‌ నుంచి జనగణన-2027కు సం బంధించిన పలు అంశాలపై కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌తో భారతీ హోళీకే రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా జనగణన హ్యాండ్‌ బుక్‌ రూపొందించేందుకు తొమ్మిది ప్రధాన అంశాలకు సంబం ధించిన సమాచారాన్ని నమోదు చేయాలని ఆదేశించారు. జనగణన హ్యాండ్‌బుక్‌పై అధికారులకు శిక్షణ ఇచ్చామని, గడువులోగా ప్రక్రియ పూర్తిచేస్తామని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ తెలిపారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి గొట్టె జయశ్రీ, జిల్లా జనగణన అధికారి, ముఖ్య ప్రణాళిక అధికారి పీబీ శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 08 , 2026 | 12:08 AM