డ్రాఫ్ట్ ఓటర్ జాబితాల వెల్లడి
ABN , Publish Date - Jan 01 , 2026 | 11:46 PM
మునిసిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 39 వార్డుల వారిగా డ్రాఫ్ట్ ఓటర్ జాబితా, పోలింగ్ స్టేషన్ల వివరాలను వెల్లడించారు.
సిరిసిల్ల, జనవరి 1(ఆంధ్రజ్యోతి): మునిసిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 39 వార్డుల వారిగా డ్రాఫ్ట్ ఓటర్ జాబితా, పోలింగ్ స్టేషన్ల వివరాలను వెల్లడించారు. గురువారం సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ఖదీర్‌పాషా డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను వెల్లడించారు. ప్రజల పరీశీలన కోసం మున్సిపల్ కార్యాలయం లో అందుబాటులో ఉంచారు. డ్రాఫ్ట్ ఓటర్ జాబితా ప్రకారం సిరిసిల్లాలో 81,959మంది ఓటర్లుండగా, పురుషులు 39942 మంది, మహిళలు 42011 మంది, ఆరుగురు ఇతరులున్నారు. పురుషులకంటే 2069 మంది మహిళలు అధికంగా ఉన్నారు. ఓటర్లు జాబితాలో తమ పేరు, చిరునామా ఇతర తప్పు లు, అభ్యంతరాలకు సంబంధించిన వివరాలతో దరఖాస్తులను మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలని కమిషనర్ సూచించారు. ఈనెల 5న మున్సిపల్ పరిధిలో, 6న జిల్లాస్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి తుది ఓటర్ జాబితాను ఈనెల 10న వెల్లడిస్తారు.