Share News

శారీరక దృఢత్వాన్ని పెంపొందించేందుకే క్రమశిక్షణ పరుగులు

ABN , Publish Date - Aug 09 , 2026 | 12:45 AM

బెటాలియన్‌లో పని చేసే పోలీస్‌ సిబ్బంది, అధికారుల్లో శారీరక దృఢత్వాన్ని పెంపొందించేందుకే ప్రతి శనివారం క్రమశిక్షణ పరుగులను ఏర్పాటు చేశామని సిరిసిల్ల 17వ పోలీస్‌ బెటాలియన్‌ కమాండెంట్‌ పీజేపీసీ ఛటర్జీ అన్నారు.

శారీరక దృఢత్వాన్ని పెంపొందించేందుకే క్రమశిక్షణ పరుగులు

సిరిసిల్ల అర్బన్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి) : బెటాలియన్‌లో పని చేసే పోలీస్‌ సిబ్బంది, అధికారుల్లో శారీరక దృఢత్వాన్ని పెంపొందించేందుకే ప్రతి శనివారం క్రమశిక్షణ పరుగులను ఏర్పాటు చేశామని సిరిసిల్ల 17వ పోలీస్‌ బెటాలియన్‌ కమాండెంట్‌ పీజేపీసీ ఛటర్జీ అన్నారు. సిరిసిల్ల అర్బన్‌ పరిధిలోని సర్ధాపూర్‌ శివారులో 17వ పోలీస్‌ బెటాలియన్‌లో శనివారం క్రమశిక్షణ పరుగులో భాగం గా 10కే రన్‌ను కమాండెంట్‌ ప్రారంభించి వారితో కలిసి పరుగు తీశారు. ఈ సందర్భంగా కమాండెంట్‌ ఛటర్జీ మాట్లాడుతూ పోలీస్‌ శాఖలో విధులు నిర్వ హించే సిబ్బందికి శారీరక ధృఢత్వం అత్యంత అవసరమన్నారు. విధి నిర్వహ ణలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సమర్థవంతంగా స్పందించేందుకు శారీర కంగా, మానసికంగా ధృఢంగా ఉండాలని సూచించారు. ప్రతిరోజు వ్యాయామం, రన్నింగ్‌ వంటి శారీరక కార్యకలాపాలను జీవితంలో భాగం చేసుకోవడంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు విధి నిర్వహణలో మరింత చురుకుదనంతో పనిచేయవచ్చని అన్నారు. సిబ్బంది ఆరోగ్యం, ఫిట్‌నెస్‌లపై బెటాలియన్‌లో ప్రత్యే క దృష్టి సారిస్తున్నామన్నారు. అదేవిధంగా రన్నింగ్‌ వంటి కార్యక్రమాలు, సిబ్బం దిలో టీమ్‌ స్పిరిట్‌, పరస్పన సహకారం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొంది స్తాయన్నారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ నిరంతరం శారీరక వ్యాయామం చేయాలని సూచించారు. 10 కిలోమీటర్ల రన్నింగ్‌ కార్యక్రమంలో అధికారులు, స్బిబంది సమన్వయంతో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం పూర్తిచేయడం అభినందనీయమన్నారు. బెటాలియన్‌లో నిర్వహించిన ఈకార్యక్ర మంతో సిబ్బందిలో ఉత్సహాన్ని నింపిందన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమాండెంట్‌లు, ఆర్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - Aug 09 , 2026 | 12:45 AM