Share News

భీమన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - Apr 05 , 2026 | 11:36 PM

వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ భీమేశ్వర స్వామి ఆలయానికి ఆదివారం సెలవు రోజుకావడంతో భక్తులు పోటెత్తారు.

భీమన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

వేములవాడ, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ భీమేశ్వర స్వామి ఆలయానికి ఆదివారం సెలవు రోజుకావడంతో భక్తులు పోటెత్తారు. కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకున్న భక్తులు పవిత్రస్నానాలు ఆచరించి ధర్మదర్శనం, కోడెమొక్కు క్యూలైన్‌ల ద్వారా ఆలయంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా భీమేశ్వర స్వామిని దర్శించుకుని, కోడెమొక్కు చెల్లించుకున్నారు.

భీమన్న సేవలో టీజీఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ..

వేములవాడ భీమేశ్వర స్వామిని టీజీఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ కర్ణాటి వరుణ్‌రెడ్డి దర్శించుకున్నారు. స్వామివారి ప్రత్యేక సేవలో పాల్గొన్న అనంతరం అర్చకులు ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు రాజన్న ప్రసాదాన్ని అందజేశారు.

పలువురు భక్తుల విరాళాలు..

వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి హైదరాబాద్‌ ఎల్బీనగర్‌కు చెందిన జొన్నగాని రాజేశ్‌-సరిత దంపతులు రూ.లక్ష విరాళం అందజేయగా, సిద్దిపేట జిల్లా కేంద్రానికి చేందిన ఆకుల నితేందర్‌ రూ.50వేల విరాళాన్ని ఏఈవో శ్రావణ్‌ కుమార్‌కు అందజేశారు.

Updated Date - Apr 05 , 2026 | 11:36 PM