Share News

భీమన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - Nov 10 , 2026 | 12:16 AM

వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.

భీమన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

వేములవాడ, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. దీపావళి పండుగను పుర స్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామి వారికి ప్రీతిపాత్రమైన సోమవారం కావడంతో భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు బారులుతీరారు. ముందుగా కల్యాణకట్టలో తలనీలాలు సమర్పిం చుకుని, పవిత్రస్నానాలను ఆచరించారు. ధర్మద ర్శనం, కోడెమొక్కు క్యూలైన్‌లు, శీఘ్రదర్శనం క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి చేరుకున్న భక్తు లు భీమేశ్వర స్వామిని దర్శించుకున్నారు.స్వామి వారికి కోడెమొక్కులు చెల్లించుకునేందుకు భక్తు లు సుమారుగా రెండు గంటలపాటు క్యూలైన్‌ లో నిరీక్షించారు. గండాదీపంలో నూనెపోస్తూ గండాలు తొలగిపోవాలని వేడుకున్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భక్తులు ఆలయ ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించి సుమంగళి గా ఉండాలని మొక్కులు చెల్లించుకున్నారు.

ఉచిత పులిహోర ప్రసాద వితరణ

వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల కోసం ఉదయం పూట ఉచిత పులిహోర ప్రసాద వితరణను ఈవో రమాదేవి ప్రారంభిం చారు. ఆలయంలో ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారికి నిర్వహించే అన్నపూజ అనంతరం భక్తులకు అన్నప్రసాదం అందజే స్తుండగా భక్తులకు మరింత ఉచిత పులిహోర అందించేందుకు నిర్ణయించారు. ఇదిలా ఉండగా ఆలయంలోని దీపాల కౌంటర్‌ వద్ద టెండర్‌దా రులు ప్రమిదలను ఎంత రేటుకు విక్రయిస్తు న్నారని అడిగి తెలుసుకున్నారు. భక్తులపై అద నపు భారం పడకుండా నిర్ణయించిన ధర రూ. 40లకే దీపాలను అందించాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించి, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారు లను ఆదేశించారు.

భీమన్నను దర్శించుకున్న విప్‌

వేములవాడ భీమేశ్వర స్వామిని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ కుటుంబ సమేతంగా దర్శిం చుకున్నారు. భీమన్న ఆలయానికి సతీసమేతం గా విచ్చేసిన ఆయనకు అర్చకులు ఘనస్వా గతం పలికారు. స్వామివారి ప్రత్యేక పూజలో పాల్గొన్న అనంతరం ఆలయ మండపంలో అర్చకులు ఆశీర్వచనం ఇవ్వగా, డీఈవో ప్రతాప నవీన్‌ కుమార్‌, ఏఈవో జయకుమారి, లక్ష్మణ్‌ రావులు శ్రీస్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసా దాలను అందజేశారు.

Updated Date - Nov 10 , 2026 | 12:16 AM