Share News

అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి

ABN , Publish Date - Jul 21 , 2026 | 11:46 PM

వేముల వాడ నియోజకవర్గ పరిధిలో వివిధ అభివృద్ధి పను లను సకాలంలో పూర్తిచేసి ప్రజలకు అందుబాటు లోకి తీసుకురావాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అధికారులను ఆదేశించారు.

అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి

వేములవాడ, జూలై 21 (ఆంధ్రజ్యోతి): వేముల వాడ నియోజకవర్గ పరిధిలో వివిధ అభివృద్ధి పను లను సకాలంలో పూర్తిచేసి ప్రజలకు అందుబాటు లోకి తీసుకురావాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్‌ శాఖ అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరి ధిలో సీఆర్‌ఆర్‌, ఎంఆర్‌ఆర్‌ గ్రాంట్లు, స్పెషల్‌ డెవ లప్‌మెంట్‌ ఫండ్స్‌, డీఎంఎఫ్‌టీ, ఈజీఎస్‌, సీఆర్‌ ఆర్‌ ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులతో చేపడుతున్న అభి వృద్ధి పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగితెలుసుకున్నారు. అనంతరం విప్‌ మాట్లాడు తూ పెండిండగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పను లు ఎక్కడ ఆలస్యమవుతున్నాయో గుర్తించి వాటిని వేగవంతం చేయాలని, నాణ్యత లో ఎలాంటి రాజీపడకుండా నిర్ధే శిత గడువులోగా పూర్తి చేయాల ని అధికారులకు సూచించారు. ప్రజలకు ఉపయోగపడే అభివృ ద్ధి పనులు త్వరగా పూర్తి చేయ డం ద్వారా ప్రభుత్వ లక్ష్యం నెర వేరుతుందన్నారు. ఈ సమావే శంలో సిరిసిల్ల ఈఈ సుదర్శన్‌ రెడ్డి, వేములవాడ డీఈ విష్ణు వర్థన్‌, చందుర్తి డీఈ పవన కు మారి, కోరుట్ల డీఈ సత్యనారా యణ, ఏఈలు మనోహర్‌, అంజయ్య, సాయితేజ, జగదీష్‌, సుచరిత్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Jul 21 , 2026 | 11:46 PM