Share News

పాఠశాలల్లో అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలి

ABN , Publish Date - Feb 20 , 2026 | 11:42 PM

జిల్లాలో పీఎంశ్రీ పథకం కింద ఎంపికైన పాఠశాలల్లో చేపట్టిన అభి వృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

పాఠశాలల్లో అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలి

సిరిసిల్ల అర్బన్‌, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో పీఎంశ్రీ పథకం కింద ఎంపికైన పాఠశాలల్లో చేపట్టిన అభి వృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలె క్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో శుక్రవారం సంబంధి త అధికారులతో పీఎంశ్రీ అభివృద్ధి పనులపై ఇన్‌చార్జి కలెక్టర్‌ సమీక్షించారు. పీఎంశ్రీ పథకంలో జిల్లాలో 16 పాఠశాలలు ఎంపిక అయ్యాయని అన్నారు. వాటిలో అదనపు తరగతి గదులు, కంప్యూటర్‌ ల్యాబ్‌లు, సైన్స్‌ల్యాబ్‌లు, లైబ్రరీలు, వర్షం నీరు ఇంకుడు గుంతలు ఇతర నిర్మాణాలు ఉన్నాయని అధికా రులు ఇన్‌చార్జి కలెక్టర్‌ దృష్టికి తీసుకవచ్చారు. ఈ సందర్భంగా ఇన్‌ చార్జి కలెక్టర్‌ మాట్లాడుతూ పీఎంశ్రీ కింద ఎంపికైన పాఠశాలల్లో ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేసి విద్యార్థుల కు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఆయా పాఠశాల ల్లో పనులను జిల్లా విద్యాశాఖ అధికారి పరిశీలించాలని ఆదేశించారు. కస్తుర్బాగాంధీ బాలిక విద్యాలయంలో చేపట్టిన పనులను సకాలంలో పూర్తిచేయాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా విద్యాధి కారి జగన్‌మోహన్‌రెడ్డి, టీజీఈడబ్ల్యూ ఐడీసీ డీఈ సత్యనారాయణ రావు, ఏఈలు నాగరాజు, అశోక్‌కుమార్‌ పలువురు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2026 | 11:42 PM