Share News

అందరి సహకారంతో అభివృద్ధి పనులు

ABN , Publish Date - Jun 01 , 2026 | 12:41 AM

అందరి సహకారంతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని స్థానిక ఎమ్మెల్యే, ప్రభు త్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

అందరి సహకారంతో అభివృద్ధి పనులు

వేములవాడ, మే 31 (ఆంధ్రజ్యోతి): అందరి సహకారంతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని స్థానిక ఎమ్మెల్యే, ప్రభు త్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. పట్టణంలోని అమరవీరుల స్తూపం నుంచి రాజన్న ఆలయం వరకు జరుగుతున్న 80 ఫీట్ల రోడ్డును ఆదివారం ప్రభుత్వ విప్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ రాజన్న ఆలయ అభివృద్ధితో పాటు గా పట్టణాభివృద్ధికి సమాన ప్రాధాన్యం కల్పిస్తూ సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రుల సహకారంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయ న్నారు. ఆలయాభివృద్ధి పనులు రూ.150 కోట్లతో శరవేగంగా కొన సాగుతున్నాయని తెలిపారు. రోడ్డు విస్తరణ, అభివృద్ది పనుల్లో నిర్వాసితులు, దుకాణదారులు, పట్టణ పెద్దలు, ప్రజాప్రతినిధుల సహకారంతో పనులు జరుగుతున్నాయని వివరించారు. రూ.6.50 కోట్ల అంచనా వ్యయంతో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయనీ, కాంట్రాక్టర్‌ త్వరితగతిన పనులు పూర్తిచేసి అప్పగిస్తామని హామీచ్చిన ట్లు తెలిపారు. త్వరలోనే తారు రోడ్డు నిర్మాణం పూర్తిచేయాలని అధికా రులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. పట్టణ సుందరీకరణ కోసం రూ.2.60 కోట్లతో పనులు జరుగుతున్నాయన్నారు. సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టం పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. వన మహోత్సవంలో భాగంగా రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు ఆధ్మాత్మిక వాతావరణా న్ని ప్రతిబింబించేలా ప్రత్యేకమైన మొక్కలు నాటాలని సూచించారు. రూ. 35 కోట్లతో అన్నదాన సత్రం పనులు సాగుతున్నాయని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భీమేశ్వర ఆలయాన్ని రూ. 6 కోట్లతో ఆధునికరించినట్లు తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధి పూర్తయ్యే వర కు భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. బద్ది పోచమ్మ ఆలయం వద్ద పనులు వేగంగా జరుగుతున్నాయని, బద్ది పోచమ్మ ఆల య నిర్మాణ నిర్వాసితులకు షెటర్లు ఏర్పాటుచేసే పనులు త్వరలో పూర్తవుతాయని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ పుల్కం రాజు, వైస్‌చైర్మన్‌ నరాల శేఖర్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ కనికరపు రాకేష్‌ కౌన్సిలర్లు కొండ శేఖర్‌, అన్నారపు శ్రీనివాస్‌, కొక్కుల బాలకృష్ణ, తోట రాజు, నాయకులు సాగరం వెంకటస్వామి, కూరగాయాల కొము రయ్య, సిరిగిరి శ్రీకాంత్‌, పులి రాంబాబు, నాగుల విష్ణు ఉన్నారు.

Updated Date - Jun 01 , 2026 | 12:41 AM