Share News

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

ABN , Publish Date - Jan 18 , 2026 | 12:39 AM

వేములవాడ పట్టణంలో వీటీడీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ సంబంధిత అధికారులను ఆదే శించారు.

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

వేములవాడ, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): వేములవాడ పట్టణంలో వీటీడీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ సంబంధిత అధికారులను ఆదే శించారు. వేములవాడ పట్టణంలో జరుగుతున్న కోరుట్ల బస్‌స్టాండ్‌ నుంచి చెక్కపల్లి చౌరస్తా మార్గంలో రోడ్డు పనులు, తిప్పాపూర్‌ నుంచి ఆలయం వరకు రోడ్డు విస్తరణ పనులు, గుడి చెరువు సుందరీకరణ, నాంపల్లి గుట్ట సుందరీకరణ పనులను శనివారం సంబంధిత అధికా రులతో కలిసి పరిశీలించారు. పట్టణంలోని కోరుట్ల బస్టాండు నుంచి చెక్కపల్లి చౌరస్తా మార్గంలో వీటీడీఏ నిధులతో ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వ ర్యంలో చేపడుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంత రం కలెక్టర్‌ మాట్లాడుతూ రోడ్డు నిర్మాణంతో పాటుగా మురుగు కాలు వల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రణాళికాబద్ధంగా పను లను శివరాత్రి జాతరలోగా పూర్తి చేయాలని సూచించారు. నాణ్యత పాటిస్తూ, యుద్ధప్రాతిదికన పనులు పూర్తయ్యేలా నిరంతరం పర్యవే క్షణ చేయాలన్నారు. ప్రధాన రోడ్డు విస్తరణ పనులు వేగంగా పూర్తి చేయాలని, విస్తరణ, అభివృద్ధి పనులపై ప్రతి రెండు రోజులకు ఒక సారి సమీక్ష సమావేశం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. శివరాత్రిలో గా మెజార్టీ పనులు పూర్తిచేసి, భక్తులకు అందుబాటులోకి తీసుకురా వాలని అన్నారు. గుడి చెరువు వద్ద టూరిజం శాఖ ఆధ్వర్యంలో చేప ట్టిన పనులను పరిశీలించామని అన్నారు. ప్రవేశ ద్వారం నుంచి మొద లుకుని చివరి వరకు ఉన్న విగ్రహాలను, విద్యుత్‌ దీపాలు, మొక్కలు, ఫౌంటేన్‌ అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించామని తెలిపారు. ప్రతి పనికి సంబంధించి మ్యాప్‌లను చూస్తూ క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు తెలి పారు. తుది దపా పనులను వేగంగా పూర్తి చేసి పట్టణ ప్రజలకు, భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు చెప్పారు.నాంపల్లి గుట్టపైన త్వరలో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన విమానాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నాంప ల్లి గుట్టపై ప్రసాదం కౌంటర్‌ సమీపంలో పనులు కొనసాగుతున్న వివ రించారు. భక్తులకు ఆహ్లాదం పంచేందుకు పనులు, ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన విమానాన్ని, ఇతర పరికరాలు ఏర్పాటు చేయనున్న ట్లు తెలిపారు. ఆమె వెంట ఆర్డీవో రాధాబాయి, పబ్లిక్‌ హెల్త్‌ డీఈ వరుణ్‌, తహసీల్దార్‌ విజయ్‌ ప్రకాశ్‌రావు, టీపీవో అన్సార్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ నరసింహచారి, డీఈ శాంతయ్య, తదితరులు ఉన్నారు.

అభివృద్ధి పనులకు స్థలాల పరిశీలన

చందుర్తి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): చందుర్తి మండలంలో పలు అభివృద్ధి పనులకు స్థలాలు ఇంచార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ శని వారం పరిశీలించారు. మండలంలోని మూడపల్లి గ్రామంలో క్రీడా మైదానం సమీపంలో యంగ్‌ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ నిర్మాణానికి, చందుర్తి మండల కేంద్రంలోని బోడగుట్ట ప్రాంతంలో వేర్‌ హౌస్‌ గోదాం నిర్మాణానికి రెవెన్యూ అధికారులతో కలిసి ఇంచార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ స్థలాలు పరిశీలించారు. ఆయా గ్రామాల్లో స్థలాలకు సంబంధించిన నక్షాలు పరిశీలించి, అధికారులతో చర్చిం చారు. పరిశీలనలో వేములవాడ ఆర్డీవో రాధాబాయి, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్‌ బేగం, తహసీల్దార్‌ భూపతి, సర్పంచ్‌లు చిలుక మల్లేశ్వరి-అంజిబాబు, పులి సత్తయ్య, వివిధ శాఖల అధికారులు, తదితరు లు పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2026 | 12:39 AM