Share News

‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’తో గ్రామాల అభివృద్ది

ABN , Publish Date - Mar 10 , 2026 | 12:12 AM

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యేక్రమంతో గ్రామాలు అన్ని విధాలా అభివృద్ధి చెందుతాయని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’తో గ్రామాల అభివృద్ది
సైదాపూర్‌లో ప్రతిజ్ఞ చేస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు

సైదాపూర్‌, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యేక్రమంతో గ్రామాలు అన్ని విధాలా అభివృద్ధి చెందుతాయని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సైదాపూర్‌ మండల కేంద్రంలో సోమవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ మార్చి ఆరు నుంచి జూన్‌ 12 వరకు 99 రోజుల కార్యాచరణ ద్వారా గ్రామాల్లోని అన్ని సమస్యలు పరిష్కారం అయ్యేలా కృషి చేయాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రతను మెరుగుపరచాలని ఆదేశించారు. ప్రతీ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో హాజరు శాతం పెంచాలని, విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలన్నారు. ప్రైరవేట్‌ స్కూల్‌ బస్సు రాని గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. పాత బిల్లు చెల్లింపును సర్పంచ్‌లు సహకరించాలన్నారు. మండలవ్యాప్తంగా ప్రతీ గ్రామంలో ప్రతీ వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. మహిళా సంఘాలకు ఇచ్చిన స్టీల్‌ బ్యాంక్‌లు ఉపయోగించుకుని ప్లాస్టిక్‌ వాడకం తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ కాలెక్టర్‌ అశ్విని తానాజీ వాఖడే, డీపీవో జగదీశ్వర్‌, ఆర్డీవో రమేష్‌బాబు, ఏసీపీ మాధవి, వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్‌ దొంత సుధాకర్‌, డీడబ్ల్యూవో సరస్వతి, తహసీల్దార్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ఫ తాగు నీటి సమస్య రాకుండా చర్యలు

చిగురుమామిడి: నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ అన్నారు. మండల కేంద్రంలో సోమవారం అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై ప్రజలకు అవగహన కల్పించాలన్నారు. కలెక్టర్‌ చిత్ర మిశ్రా మాట్లాడుతూ అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అశ్విని తానాజీ వాఖడే, ఆర్డీవో మహేశ్వర్‌, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, హుస్నాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కంది తిరుపతిరెడ్డి, డీపీవో జగదీశ్వర్‌, డీఆర్డీవో శ్రీధర్‌, ఎంపీడీవో విజయ్‌కుమార్‌, జిల్లా వైద్యాదికారి వెంకటరమాణ, హౌసింగ్‌ పీడీ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 10 , 2026 | 12:12 AM