Share News

ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల అభివృద్ధి

ABN , Publish Date - Jun 05 , 2026 | 12:06 AM

గ్రామ ప్రగతి, అభివృద్ధిపై చర్చించుకోవడానికి ప్రత్యేక గ్రామ సభలు దోహదపడతాయని, ప్రజల భాగస్వామ్యంతో గ్రామ అభి వృద్ధికి కార్యాచరణ, ప్రణాళిక రూపొందించవచ్చని కలె క్టర్‌ గరిమ అగ్రవాల్‌ పేర్కొన్నారు.

ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల అభివృద్ధి

కోనరావుపేట, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): గ్రామ ప్రగతి, అభివృద్ధిపై చర్చించుకోవడానికి ప్రత్యేక గ్రామ సభలు దోహదపడతాయని, ప్రజల భాగస్వామ్యంతో గ్రామ అభి వృద్ధికి కార్యాచరణ, ప్రణాళిక రూపొందించవచ్చని కలె క్టర్‌ గరిమ అగ్రవాల్‌ పేర్కొన్నారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కోనరావు పేట మండలం మర్రిమడ్ల గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభకు కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వర్షాకాల సన్న ద్ధత, పంట మార్పిడి, వ్యవసాయ, ఉద్యానవన శాఖల కార్యాచరణ ప్రణాళిక, బడి బాట, ఘన వ్యర్థాల నిర్వహ ణ, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, విపత్తుల నిర్వహణ, పారిశుధ్యం, మొక్కల పెంపకం, జల సంరక్ష ణ, అరైవ్‌-అలైవ్‌ తదితర అంశాలపై గ్రామ ప్రజలతో సుదీర్ఘంగా చర్చించి అవగాహన కల్పించారు. తమ మండల, గ్రామాల్లో ఉన్న అధికారులు శాఖల వారీగా ఏయే కార్యక్రమాలు చేపడుతున్నారు అనే విషయాలపై సంపూర్ణ అవగాహన ప్రజలు కలిగి ఉండాలని అన్నారు. వర్షాకాల సన్నద్ధతపై అధికారులు సూచించిన విషయా లను ప్రజలు పాటించాలని కలెక్టర్‌ అన్నారు. వర్షాకాలా నికి ముందే గ్రామాల్లోని డైన్రేజీలు శుభ్రం చేయడం గ్రామ పంచాయితీ బాధ్యత అని తెలిపారు. డైన్రేజీల్లో ప్లాస్టిక్‌, బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేయవద్దని కోరా రు. ఘన వ్యర్థాల నిర్వహణపై ప్రజలు ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలని, చెత్తను నాలుగు రకాలుగా వేరు చేయాలని సూచించారు. తడి, పొడి, సానిటరీ, ప్రత్యేక చెత్తగా వేరు చేసి గ్రామ పంచాయితీ వాహనా నికి అందించాలని అన్నారు. ప్రతీ వార్డులో చెత్తను వేరు చేసి కంపోస్ట్‌ షెడ్‌కు తరలించే బాధ్యత ప్రతీ వార్డు సభ్యులు తీసుకోవాలని సూచించారు. మన ఆరోగ్యం పాడవకుండా ఉండాలంటే స్వచ్ఛందంగా ఈ సూచనలు పాటించాలని కలెకర్‌ పేర్కొన్నారు. తాగునీటి సరఫరాకు సంబంధించి క్రమంతప్పకుండా నీటి ట్యాంకులను బ్లీచిం గ్‌తో సిబ్బంది శుభ్రం చేయాలని ఆదేశించారు. సీజనల్‌ వ్యాధులు రాకుండా స్వచ్ఛమైన నీటి సరఫరా అందించే బాధ్యత అధికారులపై ఉంటుందని, నీటి సరఫరా, నిర్వ హణ సక్రమంగా లేకపోతే ప్రజలు అధికారులకు సమా చారం అందించాలని అన్నారు. ఆయిల్‌ పామ్‌, కూరగా యలు, పత్తి, తదితర లాభదాయక పంటలను సాగు చేయడానికి రైతులు ముందుకు రావాలని సూచించారు. ఆయిల్‌ పామ్‌కు సంబంధించి సిద్దిపేట జిల్లా నర్మెటలో పరిశ్రమ ఉందని, పండించిన దిగుబడిని పరిశ్రమకు తీసుకువెళ్ళడానికి దూరభారం కూడా లేదని గుర్తు చేశా రు. ఆయిల్‌పామ్‌ సాగు చేయడానికి మొక్కలకు, డ్రిప్‌ నకు సబ్సిడీ కూడా అందిస్తారని తెలి పారు. ఇందులో అంతరపంటలను సాగు చేసేందుకు అవకాశం ఉంటుం దన్నారు. వరిలో సన్న వడ్లను సాగు చేస్తే బోనస్‌ అంది స్తారని, సన్నవడ్ల సాగుపై రైతులు దృష్టి సారించాలని కోరారు. పంట మార్పిడి చేయకపోతే నేల సారం తగ్గుతుందనే విషయాన్ని రైతులు గమనించాలన్నారు. రోడ్డుభద్రత నియమాలు పాటిస్తే ప్రమాదాలను నియంత్రించడానికి అవ కాశం ఉంటుందని తెలిపారు. ద్విచక్ర వాహనం నడిపే ప్రతీ ఒక్కరు హెల్మెట్‌ ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వ ద్దని, మద్యం తాగి వాహనాలు నడపవ ద్దని అన్నారు. బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యా ర్థుల నమోదు శాతం పెంచాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు పంపించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాల లు, కళాశాలల్లో ప్రభుత్వం అనేక మౌలిక సదుపాయా లు కల్పిస్తుందని తెలిపారు. అనంతరం గ్రామంలోని నర్సరీ, కంపోస్ట్‌షెడ్‌ను కలెక్టర్‌ పరిశీలించారు. లక్ష్యానికి అనుగుణంగా మొక్కల పెంపకంపై దృష్టి సారించాల న్నారు. కంపోస్ట్‌షెడ్‌ను పూర్తిగా వినియోగంలోకి తీసుకు వచ్చి చెత్తను తప్పనిసరిగా నాలుగు విభాగాలుగా వేరు చేసి శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఆర్డీవో కేఎస్‌బీ కుమారి, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి లక్ష్మీనారాయణ, వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్‌ బేగం, పంచాయతీ అధికారి షర్ఫుద్దీన్‌, మిషన్‌ భగీరథ గ్రిడ్‌ ఈఈ అన్వర్‌, ఇంట్రా ఈఈ సుమలత, జిల్లా వైద్యాధి కారి జగన్‌మోహన్‌రెడ్డి, సర్పంచ్‌ స్వాతి, తహసీల్దార్‌ వరలక్ష్మి, ఎంపీడీవో స్నిగ్ధ, అటవీ శాఖ అధికారులు తది తరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 05 , 2026 | 12:06 AM